అర్దరాత్రి అమ్మాయిల కోసం ?, జాతరలో ఏం జరిగింది, రౌడీషీటర్ల ఎంట్రీతో !

బెంగళూరు: ఆ ప్రాంతంలో జాతర జరిగింది. జాతర పూర్తి కావడానికి ఏడెనిమిది గంటలు పట్టింది. జాతరకు వేలాది మంది ప్రజలు బయట ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జాతర మధ్యలో రెండు గ్యాంగ్ లు మధ్య వాగ్వాదం, ఏరియా ఆదిపత్యం కోసం, ఓ అమ్మాయి విషయంలో గొడవలు మోదలైనాయి. అంతే వేటకొడవళ్లు, కత్తులు గాల్లోకి ఎగిరాయి.

దేవుడిని చూడానికి వచ్చిన వేల సంఖ్యలో జనం, చిన్నారుల సంబరాలు నలిచిపోయి పరుగులు తీశారు.

ఈ తంతంగం మొత్తం బెంగళూరు నగరంలోని సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తుమారియమ్మ జాతరలో కనిపించింది. రెండు వర్గాల మధ్య వర్గపోరు, గొడవలు, గతంలో జరిగిన. కొట్లాటలు, అదే సమయంలో జాతరలో యువతులను ఆటపట్టించడంతో సిద్దాపురలోని అజిత్, రాజా అనే రౌడీల గ్యాంగ్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి.

Bengaluru.

అప్పటికే దాచిపెట్టిన వేటకొడవళ్లు తీసుకుని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో ప్రజలు పరుగుతీశారు. జాతరలో ప్రజలు పరుగు తియ్యడంతో సామాన్య ప్రజలు హడలిపోయారు. జాతర మధ్యలోనే ఆగిపోయింది. ప్రాణభయంతో ప్రజలు పరుగుతీశారు. ఈ కేసులో రాజా గ్యాంగ్‌లోని నలుగురిని సిద్ధాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒకే ఏరియాలోని ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఒకరినొకరు ఎప్పుడు చంపుకుందామా అని ఎదురుచూశారు. సినిమా స్టైల్‌లో జాతరలో ఫైట్‌కు ప్లాన్ చేసిన ప్రత్యర్థి గ్యాంగ్ ఈ మరియమ్మ జాతర సమయాన్ని టార్గెట్ చేసింది. అజిత్ , గణేష్, రాజు, అప్పు తదితరులు రాత్రి జాతరకు వెళ్లారు.

ఈసారి ఆ ప్రాంతంలోని యువతులను టార్గెట్ చేసి వారితోనే పని ముగించాలని ప్లాన్ చేసిన రాజు గ్యాంగ్ గొడవకు తెరలేపారు. ఈసారి ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కోపంలో అజిత్ ఇంటికి వెళ్లిన రౌడీ షీటర్ రాజు టీమ్‌ను హెచ్చరించాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో అజిత్ అతని ఫ్రెండ్స్ కలిసి అక్కడి దీపా బార్‌కు వెళ్లారు. ఆ సమయంలో రౌడీ షీటర్ల ముఠా అజిత్‌పై దాడి చేసి పరారైంది.

Bengaluru.

కేసు నమోదు చేసుకున్న సిద్దాపూర్ పోలీసులు అరవింద్, రాజా, గణేష్, శ్రీనివాస్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన అభి, గాంధీ, మనోజ్, సయ్యద్ సలీం, విజయ్‌ల కోసం గాలిస్తున్నారు. మిగిలిన నిందితులు అరెస్టు అయిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. మొత్తం మీద బెంగళూరులో జరిగిన జాతరలో రౌడీషీటర్ల మద్య గ్యాంగ్ వార్ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+