Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్కూల్ లో టీచర్, స్కూల్ బయట టీచర్ కొడుకు టార్చర్, చివరికి అమ్మాయి !

బెంగళూరు/హోస్ కోటే: స్కూల్ కు వెలుతున్న అమ్మాయి బాగా చదువుకుంటున్నది. స్కూల్ చదువు పూర్తి అయిన తరువాత కాలేజ్ లో చేరి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని ఆ అమ్మాయి అనుకుంది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయికి స్కూల్ లో టీచర్, బయట అదే స్కూల్ టీచర్ కొడుకు టార్చర్ పెట్టారు. తండ్రీ కొడుకులు చిత్రహింసలకు గురి చెయ్యడంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.

ప్రముఖ ప్రైవేట్ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న టీచర్, అతని కొడుకు వేధింపులకు విసిగిపోయి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలోని బెంగళూరు-చిత్తూరు హైవే రోడ్డులోని హోస్ కోటే (బెంగళూరు సరిహద్దు) పట్టణంలో చోటుచేసుకుంది. స్కూల్ టీచర్, ఆ స్కూల్ టీచర్ కొడుకు వేధింపులు తాళలేక ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో హోస్ కోటేలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

A girl committed suicide after being tortured by a teacher and the teachers son near Bengaluru.

సారా (16) అనే పదవ తరగతి చదువుతున్న అమ్మాయి ఉరివేసుకుని మృతి చెందిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటేలోని పార్వతీపరంలో చోటుచేసుకుంది. సారా హోస్ కోటే పట్టణంలోని మిలీనియం పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నది. అయితే సారాను స్కూల్‌ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న ఖమర్, మరో టీచర్ నళిని నిత్యం వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

రోజూ స్కూల్‌లో టీచర్‌ ఖమర్‌ వేధించేవాడు, స్కూల్‌ నుంచి బయటకు రాగానే టీచర్‌ ఖమర్‌ కొడుకు హమీన్‌ కూడా తనను ప్రేమించాలంటూ సారాను వేధించేవాడు. నిత్యం వేధింపులతో విసిగిపోయిన సారా ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హోస్ కోటే పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తండ్రీ కొడుకుల టార్చర్ తో పదవ తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం హోస్ కోటేలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+