ముద్దుకు నిరాకరించిన యువతిని చంపిన యువకుడు...!
ఓ యువతి తనను ముద్దు పెట్టుకోవాడానికి నిరాకరించడంతో అవమానానికి గురైన యువకుడు ఆవేశంతో అక్కడికక్కడే చంపివేశాడు. యువతి యువకులు ఇద్దరు కలిసి ఏకంతా ప్రదేశానికి వెళ్లడంతో ఈ సంఘటన జరిగింది. అయితే యువతిపై దాడి చేసిన అనంతరం చనిపోవడంతో ఆమేపై అడవిలోని ఆకులు కప్పి వెనుదిరిగాడు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఘటన యువతి తల్లిదండ్రుల పిర్యాధుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తనకు అంత్యంత సన్నిహితుడు,తనతో కలిసి చదువుకుంటున్నాడన్న చనువుతో ఒంటరిగా వెళ్లిన యువతిని, ఆ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆవేశంలో తాను ఏం చేస్తున్నానో తెలియక హత్య అనంతరం తనకు సంబంధం లేనట్టుగా బయటకు వచ్చిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలలోని బీజాపూర్ అనే గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసులు చెప్పిన కథనం ప్రకారం 18ఏళ్ల విద్యార్థిని తనకు తెలిసిన రమణ్ సింగ్ సయ్యం అనే యువకుడితో కలిసి ఏకంతా ప్రదేశానికి వెళ్లారు. ఈనేపథ్యంలోనే యువకుడు అమ్మాయిని ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమే నిరాకరించి పక్కకు నెట్టివేసింది. దీంతో అవమానానికి గురై, కలత చెందిన సయ్యం, విద్యార్థిని తలపై రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమే కదలలేని స్థితిలోకి ఉండడంతో నిందితుడు భయపడి విద్యార్ధినిపై ఆకులు కప్పి ఇంటికి పారిపోయి వచ్చాడని పోలీసులు తెలిపారు.
కాగా హత్య చేయబడిన యువతి తన కాలేజీ నుండే నేరుగా వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతదేశం పక్కనే ఆమే కాలేజీ బ్యాగ్ కూడ పడి ఉందని పోలీసులు తెలిపారు.కాగా యువకుడిపై హత్యానేరం క్రింద కేసులు పెట్టిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications