ప్రియుడి మర్మాంగం మీద వేడినీళ్లు పోసి బీర్ బాటిల్ తో ముఖం చెక్కేసిన గర్ల్ ఫ్రెండ్ !

బెంగళూరు/బళ్లారి: యువతి, యవకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆమెతో పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుని ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి అద్దె ఇంటిలో ఆ యువతి కాపురం పెట్టేసింది. తనను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడన్న కోపంతో ప్రియురాలు అతని మీద మసలుతున్న వేడినీళ్లు పోసి బీర్ బాటిల్ తో ముఖం చెక్కేయడం కలకలం రేపింది.

కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జలాపురానికి చెందిన జ్యోతి అనే మహిళ బెంగళూరు చేరుకుని చామరాజ్ పేట్ లో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నది. గాఢనిద్రలో ఉన్న ప్రియుడిపై జ్యోతి వేడినీళ్లు పోసి బీరు బాటిల్‌తో ముఖంపై దాడి చేసిన ఘటన బెంగళూరులోని చామరాజ్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

A girlfriend who attacked her boyfriend who was marrying another girl in the face with a beer bottle

బెంగళూరు బొమ్మసంద్ర సమీపంలోని హేరందల్లికి చెందిన విజయ్ శంకర్ భీమశంకర్ ఆర్య(30) అనే యువకుడు కలబరిగి జిల్లాకు చెందిన జ్యోతి అనే మహిళ ప్రేమించుకున్నారు. ప్రియుడు విజయ్ శంకర్ మోజులో పడిపోయిన జ్యోతి అతనికి దాసోహం అయ్యింది. ఎప్పుడు పడితే అప్పుడు ప్రియుడు విజయ్ శంకర్ అతని ప్రియురాలు జ్యోతి ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు.

పెళ్లికి ముందే విజయ్ శంకర్, జ్యోతి కలసి చామరాజ్‌పేట ఎండీ బ్లాక్‌లోని ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ప్రియుడు విజయ్ శంకర్ పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతో జ్యోతి అతనితో సహజీవనం చేస్తోంది. అయితే ప్రియురాలు జ్యోతి మీద మోజు తీరిపోవడంతో విజయ్ శంకర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.

తన ప్రియుడు విజయ్ శంకర్ వేరే అమ్మాయితో పెళ్లికి సిద్దం అయ్యాడని రెండు నెలల క్రితం జ్యోతికి తెలిసింది. ఇదే విషయంలో రెండు నెలల నుంచి జ్యోతి ఆమె ప్రియుడు విజయ్ శంకర్ తో గొడవపడుతోంది. రెండు రోజుల క్రితం విజయ్ శంకర్ ఐదు బీర్లు తీసుకుని అతని ప్రియురాలు జ్యోతి ఇంటికి వెళ్లాడు. ప్రియురాలు జ్యోతితో కలిసి విజయ్ శంకర్ బీర్లు తాగాడు.

A girlfriend who attacked her boyfriend who was marrying another girl in the face with a beer bottle

జ్యోతితో ఎంజాయ్ చేసిన విజయ్ శంకర్ తరువాత గాఢంగా నిద్రపోయాడు. ఆ సమయంలో గ్యాస్ స్టౌవ్ మీద వేడినీళ్లు కాంచిన జ్యోతి ఆ నీళ్లు ప్రియుడు విజయ్ శంకర్ ముఖం మీద, అతని మర్మాంగం మీద పోసింది. వెంటనే బీర్ బాటిల్ తీసుకుని ప్రియుడు విజయ్ శంకర్ ముఖం పచ్చడి చేసింది. 50 శాతం కాలిన గాయాలతో విక్టోరియా ఆస్పత్రిలో విజయ్ శంకర్ చికిత్స పొందుతున్నాడు.

ప్రియుడు విజయ్ శంకర్ మీద హత్యాయత్నం చేసిన జ్యోతి తప్పించుకుని పారిపోయిందని పోలీసులు అంటున్నారు. కలబురగి జిల్లా అఫ్జలాపురానికి చెందిన జ్యోతి దొడ్డమణిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆమెను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని చామరాజ్ పేట్ పోలీసులు తెలిపారు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ప్రియుడిని ప్రియురాలు హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+