మేడమ్ ఇంట్లో యువకుడు ఎక్కడ దాక్కున్నాడంటే ? షర్టులేకుండా సార్ కూడా ?
బెంగళూరు/చిక్కమగళూరు: వివాహిత మహిళ ఇంట్లోకి హిందూ యువకుడు వెళ్లాడు. వివాహిత మహిళ ముస్లీం మతానికి చెందినది. కొంతసేపటి తరువాత మహిళ ఇంట్లోకి ముస్లీం యువకులు కొందరు వెళ్లారు. ఆ సమయంలో మహిళ ఇంట్లోని వాల్ డ్రూప్స్ లో యువకుడు షర్టు లేకుండా ప్యాంట్ తో మాత్రం దర్శనం ఇవ్వడంతో సాటి ముస్లీం యువకులు షాక్ అయ్యారు.
కర్జాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంతకాలం ఓ వర్గం వాళ్లు మరో వర్గం వారిని చూస్తే ఒకరి మీద ఒకరు మండిపడేవాళ్లు ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయినా పరిస్థితులు మాత్రం తారుమారు అయ్యాయి. గతంలో హిందువులు, ముస్లీం యువతి, యువకులు కలిసి కనపడితే కొందరు వారి మీద దాడులు చెయ్యడం మామూలుగానే జరగిగేది.

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని మడిగెరె తాలుకాలోని బణకల్ ప్రాంతంలో అజిత్ పూజారి అలియాస్ అజిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇందిరానగర్ లో ముస్లీం మతానికి చెందిన వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మతానికి చెందిన మహిళ ఇంట్లోకి అజిత్ పూజారి అనే యువకుడు వెళ్లాడు. తరువాత ముస్లీం మహిళ ఇంట్లోనే అజిత్ పూజారి చాలాసేపు ఉన్నాడు.
రెండు గంటల తరువాత ముస్లీం మహిళ బంధువులు అయిన కొందరు యువకులు ఆమె ఇంట్లోకి వెళ్లారు. అంత వరకు ఇంట్లో ఎక్కడ ఉన్నాడో ఏమో తెలీదు కాని వెంటనే అజిత్ పూజారి మహిళ ఇంట్లోని వాల్ డ్రూప్ లోకి వెళ్లి దాక్కున్నాడు. ఇంట్లో చాలా సేపు అజిత్ కోసం వెతికిన యువకులు తరువాత అనుమానం వచ్చి వాల్ డ్రూప్ లో చూడగా అందులో షర్టు తీసేసి ప్యాంట్ తో మాత్రమే అజిత్ పూజారి కనపడ్డాడు.

వెంటనే అజిత్ పూజారిని బయటకు లాగిన ముస్లీం యువకులు అతన్ని చితకబాదేశారు. తరువాత అజిత్ పూజారిని మూడిగెరె పోలీసులకు అప్పగించారు. పోలీసులు అజిత్ పూజారిని విచారణ చేశారు. తాను రోడ్డు మీద నడుచుకుని వెలుతుంటే మహిళ ఇంట్లోకి లాక్కెళ్లి తన షర్టు చింపేసి తనను చితకబాదేశారని అజిత్ పూజారి చెబుతున్నాడని పోలీసులు అన్నారు.
అయితే తాను తలుపు తీసేసి ఇంట్లో పని చేసుకుంటున్నానని, తన ఇంట్లోకి చొరబడిన అజిత్ పూజారి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ముస్లీం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఎవరు నిజం చెబుతున్నారు ?, ఎవరు అపద్దం చెబుతున్నారు అంటూ విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇంతకాలం బీజేపీ అధికారంలోకి ఉన్న సమయంలో ఓ వర్గం వాళ్లు రెచ్చిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరో వర్గం వాళ్లు రెచ్చిపోవడం మొదలైయ్యిందని స్థానికులు అంటున్నారు.












Click it and Unblock the Notifications