మేజర్ చేతిలో హత్య: ఆమె మిసెస్ ఇండియా ఫైనలిస్ట్, ‘సంతోషంగా జీవించే శైలజ’
Recommended Video

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం సాయంత్రం మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ ద్వివేది మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెను మేజర్ నిఘిల్ హండా గొంతు కోసి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
మేజర్ హండా చేతిలో గురైన శైలజ ద్వివేది మాజీ మిసెస్ ఇండియా కావడం గమనార్హం. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన కారణంగానే హండా.. ఆమెను హత్య చేశాడు.

శైలజ సాధారణ గృహిణే కాదు..
కాగా, శైలజ ద్వివేది కేవలం ఇంటి విషయాలకే పరిమితమైన సాధారణే కాదు. సామాజిక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. 2017లో జరిగిన మిసెస్ ఇండియా ఎర్త్ ఫైనలిస్టులో ఆమె కూడా ఒకరు కావడం గమనార్హం. అర్బన్ ప్లానింగ్, జాగ్రఫీలో పీజీ పట్టాలు సాధించిన ఉన్నత విద్యావంతురాలు కూడా. అంతేగాక, అధ్యాపకురాలిగా ఐదు సంవత్సరాలు పనిచేశారామె. సామాజిక కార్యక్రమాల్లోనే శైలజ ఉత్సాహంగా పాల్గొనే వారు. ఓ ఎన్జీఓ సంస్థతో కలిసి వెనుకబడిన వర్గాల పిల్లల అభివృద్ధి కోసం కృషి చేశారు.

శైలజ ఓ స్వాప్నికురాలు
‘పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, వంటచేయడం నా హాబీలు. నేనొక స్వాప్నికురాలిని. అసలు కలలే కనకపోతే ఏదీ సాధించలేరు అనేదాన్ని నేను గట్టిగా నమ్ముతా. ధైర్యం, నైపుణ్యాలు, కష్టపడేతత్వం ఉంటే దేన్నైనా కచ్చితంగా సాధించి తీరుతాం. చాలా తీవ్రంగా సాధించాలనే తపన ఉంటే దానికి కావాల్సిన శక్తి నీ సొంతం అవుతుంది. ఇప్పుడు కిరీటం గెలవాలని చాలా ఆరాటంగా ఎదురు చూస్తున్నా' అని ఆ పోటీలో చెప్పారు.

సంతోషంగా జీవించే అదృష్టం
‘నా చుట్టూ ఉన్నవారితో నవ్వుతూ సరదాగా ఉండటం నాకిష్టం. సరదాగా గడపం నాకిష్టం. నాలో చాలా ఆత్మవిశ్వాసం ఉంది. నేను సంతోషంగా జీవించే ఓ అదృష్టవంతురాలైన మహిళను' అని మిసెస్ ఇండియా ఎర్త్ ఫైనల్లో న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నకు సమధానంగా శైలజ ద్వివేది చెప్పారు.

మిసెస్ ఇండియా కాకపోయినా..
కానీ, ఆమె మిసెస్ ఇండియా కిరీటం గెలవాలన్న ఆమె కోరిక నెరవేరకపోయినా, అక్కడి వారి అభిమానాన్ని చూరగొన్నారు. మహిళల మీద జరిగే దాడులు తననెంతో బాధిస్తాయని వెల్లడించిన ఆమె చివరికి అలాంటి దాడిలోనే ప్రాణాలు కోల్పోవడం విచారకరం.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications