Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీరోయిన్ కంటే అందమైన భార్య, ఆంటీ మోజులో పడిన భర్త ఏం చేశాడంటే, అంతే !

బెంగళూరు/మైసూరు: వ్యవసాయం చేస్తున్న వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. వయసుకు వచ్చిన తరువాత కూతురు హీరోయిన్ కంటే చాలా అందంగా తయారైయ్యింది. ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి ఇతర జిల్లాల నుంచి చాలా మంది పెళ్లి చూపులకు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే కూతురు దగ్గరగా ఉంటుందని పక్కఊరిలోని యువకుడితో ఆమె పెళ్లి జరిపించారు. అయితే ఆంటీ మోజులో పడిన భర్త అందమైన భార్యను హత్య చెయ్యడం కలకలం రేపింది.

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని టీ, నరశీపుర తాలుకాలోని కుళ్ళనకుప్పలు ప్రాంతంలో రాజప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజప్పకు మనురాణి అలియాస్ రాణి అనే కుమార్తె ఉంది. పేరుకు తగ్గట్లు గానే మనురాణి లక్షణంగా యువరాణిలా, హీరోయిన్ కంటే చాలా అందంగా ఉంటుంది. మనురాణిని పెళ్లి చేసుకుంటామని మైసూరు, మండ్య, కొడుగు తదితర జిల్లాల నుంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి.

A husband who killed his beautiful wife by having an illicit relationship with the aunty next door
అయితే కూతురు దగ్గరగా ఉండాలని బావించిన రాజప్ప పక్క గ్రామంలో సొంత పొలాల్లో వ్యసాయం చేయిస్తున్న హనుమనహాళు గ్రామంలో నివాసం ఉంటున్న మంజు అనే యువకుడితో కూతురు మనురాణి పెళ్లి జరిపించడానికి సిద్దం అయ్యాడు. ఆరు సంవత్సరాల క్రితం అప్పు చేసిన రాజప్ప కూతురి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాడు.

అల్లుడు మంజు అడిగిన కట్నకానుకలు ఇచ్చిన రాజప్ప ఆయన కూతురు మనురాణిని కాపురానికి పంపించాడు. రెండు సంవత్సరాలు భార్య మనురాణితో చక్కగా కాపురం చేసిన మంజు అసలు బండారం తరువాత బయటపడింది. సొంత గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళతో పెళ్లికి ముందే అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఇంతకాలం సీక్రేట్ గా కాలం గడిపేసిన మంజు అసలు మ్యాటర్ అతని భార్య మనురాణికి తెలిసిపోయింది.

భర్త మంజు అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మనురాణి అతన్ని నిలదీసింది. అందమైన భార్య ఇంట్లో ఉన్నా ఆంటీ మోజులో పడిపోయిన మంజు మాత్రం అతని భార్య గురించి పట్టించుకోవడం మానేశాడు. విషయం తెలుసుకున్న మనురాణి కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. పంచాయితీలు జరిగినా మంజు మాత్రం ఆంటీని వదులుకోవడానికి సిద్దంగా లేనని అతని భార్య మనురాణికి తేల్చి చెప్పాడు.

A husband who killed his beautiful wife by having an illicit relationship with the aunty next door

భర్త మంజును దారిలోకి తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేసిన మనురాణి సోమవారం అర్దరాత్రి ఇంట్లో శవమైయ్యింది. మనురాణి విషం తాగి ఆత్మహత్య చేసుకుందని మంజు ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే మనురాణికి బలవంతంగా విషం తాపించి ఆమె భర్త మంజునే హత్య చేశాడన మనురాణి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.

పోలీసులు మంజును అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో అసలు మ్యాటర్ బయటకు వస్తుందని పోలీసులు అంటున్నారు. ఆంటీ మోజులో పడిన మంజు చాలా అందమైన భార్యను పొట్టన పెట్టుకోవడం మైసూరు జిల్లాలో కలకలం రేపింది. కేసు విచారణలో ఉందని మైసూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+