హ్యాపీలైఫ్, అందరూ సెటిల్, ఆంటీని చంపేసి అంకుల్ ఎస్కేప్, కొడుకు !
చెన్నై/ క్రిష్ణగిరి: ఆర్కిటెక్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం చాలా సుఖంగా ఉంటుందని ఓ యువతి కుటుంబ సభ్యులు అనుకున్నారు. కొన్ని ఏళ్ల క్రితం హ్యాపీగా పెళ్లి జరిగింది. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతులకు ఆస్తి పంపకాలు జరిగాయి. భార్యను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తి జంప్ జిలాని అని వెళ్లిపోయాడు.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని కిట్టంపట్టికి చెందిన చిన్నదురై (44). ఆర్కిటెక్ట్. ఇతని భార్య గౌరి (41). వీరికి విజి అనే కుమారుడు, సత్యా, స్నేహ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజీ లడఖ్‌లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయ్యింది. ఇద్దరు కుమార్తెలు వారి భర్తలతో హ్యాపీగా ఉంటున్నారు. చిన్నదురై, గౌరి దంపతులు గత 30 ఏళ్లుగా డెంకణికోట్టైలో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో 6 నెలల క్రితం అక్కడ కొన్న భూమిని విక్రయించి కృష్ణగిరి సమీపంలోని చిన్నేపల్లిలో స్థలం కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బును భార్యాభర్తల పేరిట డిపాజిట్ చేశారు. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నదురై తన భార్య పేరు మీద జమ చేసిన రూ. 20 లక్షలు డిపాజిట్ తన పేరుకు బదిలి చెయ్యాని కోరినట్లు సమాచారం.
ఈ విషయమై వారం రోజుల క్రితం గౌరి కృష్ణగిరి సమీపంలోని మలేరికోటలోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. శాంతి చర్చల అనంతరం గత రెండు రోజుల క్రితం చిన్నదురై వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఉదయం గౌరి అమ్మన్ నగర్ ఇంట్లో మెడ, నోరు, చేతులపై కత్తులతో పొడిచిన గాయాలతో రక్తపు మడుగులో పడి గౌరి శవమై కనిపించింది.

గౌరి హత్య విషయం తెలుసుకున్న కృష్ణగిరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తమిళరసి, ఇన్‌స్పెక్టర్ కపిలన్ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గురైన గౌరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రదేశంలో గౌరి భర్త వాడిన ద్విచక్ర వాహనం, కాలనీ కనిపించడంతో కుటుంబ కలహాల కారణంగా భర్తే అతని భార్యను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న చిన్నదురై కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications