95 మందితో భార్యను రేప్ చేయించిన భర్త, పక్కనే ఉంటూ వీడియోలు కూడా తీశాడు !
ఫ్రాన్స్/న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లోని ఓ వ్యక్తి తన భార్యపై అత్యాచారం చేసేందుకు రోజూ తెలిసిన మగవాళ్లను అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. ఐరోపాలోని ఫ్రాన్స్‌లో భార్యను వ్యభిచారిణిగా మార్చేసిన భర్త శాడిస్టులాగా ప్రవర్తించాడు. అతను ప్రతిరోజూ రాత్రి తన భార్యకు మత్తుమందు ఇచ్చిన తరువాత పరాయి మగాళ్లు భార్య పై అత్యాచారం చేయడానికి పురుషులను భర్త రెచ్చగొట్టాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
శాడిస్టు అతని భార్య మీద 10 సంవత్సరాలుగా రేప్ చేయిస్తున్నాడని పోలీసుల చెప్పారని టెలిగ్రాఫ్ మీడియా తెలిపింది. ఈ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు మహిళ మీద 95 మందికి పైగా అత్యాచారం చేశారని ఇప్పటికే కేసులు నమోదు చేశారు. 26 ఏళ్ల నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 51 మంది పురుషులను అరెస్టు చేశామని కేసు దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు.

నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారని టెలిగ్రాఫ్ మీడియా పేర్కొంది. నిందితుల్లో ఫైర్‌మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంక్‌లో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, మేల్ నర్సు, జర్నలిస్టు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనం ప్రచురించడం కలకలం రేపింది.
అంతేకాకుండా, నిందితుడైన భర్త, ఫ్రాన్స్‌కు చెందిన డొమినిక్ పిగా గుర్తించబడ్డాడు, అతని భార్య ఆహారంలో యాంటీ యాంగ్యులేషన్ డ్రగ్ లోరాజెపామ్ కలిపి ఇతర పురుషులుతో ఆమె మీద అత్యాచారం చేయించాడని వెలుగు చూసింది. ఫ్రాన్స్‌లోని మజాన్‌లోని తన ఇంటికి డొమినిక్ అతిథులు అని అతని భార్యకు చెప్పి వందలాది మంది మగాళ్లను పిలుచుకుని వెళ్లేవాడని, తరువాత భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమెతో అతని స్నేహితులు లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు వెలుగు చూసింది.

అంతే కాకుండా శాడిస్టు డొమినిక్ అతని భార్య మీద ఇతరులు రేప్ చేసే సమయంలో వాటిని రికార్డు చేశాడని, ఈ వీడియోలను అబ్యుసెస్ అనే USB డ్రైవ్‌లో సేవ్ చేసేవాడని టెలిగ్రాఫ్ మీడియా పేర్కొంది, ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కింది . 2011 నుంచి 2020 మధ్య కాలంలో డొమినిక్ భార్య మీద పలుసార్లు అత్యాచారాలు జరిగాయని, చాలా మంది పురుషులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫ్రాన్స్ పోలీసులు తెలిపారు.
డొమినిక్‌కి ఫ్రాంకోయిస్‌తో వివాహమై 50 ఏళ్లు గడుస్తున్నాయని, ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, డొమినిక్ తన భార్యను మేల్కొకుండా మత్తు మందు ఇచ్చేవాడని, పొగాకు, పెర్ఫ్యూమ్‌లను ఉపయోగించేవాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

2020లో డొమినిక్ ప్రాథమిక విచారణలో ఆరోపించిన అత్యాచార వీడియోల గురించి పోలీసులకు తెలిసింది. మహిళలు దుస్తులు మార్చుకునే గదుల్లో రహస్య కెమెరాలను చిత్రీకరిస్తున్నట్లు అనుమానం రావడంతో ఈ వీడియోల గురించి తెలుసుకున్నారు. అయినప్పటికీ, ఆ టేపుల గురించి ఆ స్త్రీకి చెప్పినప్పుడు, ఆమె నిరాశకు గురైంది. ఆమె తన భర్తతో విడాకులు కోరినట్లు కూడా సమాచారం.












Click it and Unblock the Notifications