గ్రామదేవత జాతర, భార్యను బలి ఇచ్చేసిన భర్త, ఏం జరిగిందంటే ?
వివాహం చేసుకున్న దంపతులు రెండు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి, ఇదే సమయంలో భార్య తీరుతో విసిగిపోయిన భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు ఊరిలో గ్రామ దేవత జాతర జరుగుతోంది. ఊరిలోని వాళ్లు కోళ్లు, మేకలు, గొర్రెలను గ్రామదేవతకు బలి ఇస్తే భర్త మాత్రం అతని భార్యను గ్రామ దేవతకు బలి ఇచ్చేశాడు.
గ్రామ దేవత జాతర నేపథ్యంలో పట్టణంలో అందరూ జాతర జరుపుకుంటున్నారు. ఊరిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లకు దాదాపుగా బంధువులు వచ్చేశారు. ఆ సందర్బంలో ఉదయం నుంచి మద్యం మత్తులో ఉన్న ఓ భర్త బయట నానా హంగామా చేశాడు. అదే మద్యం మత్తులో వచ్చి ఇంట్లో ఉన్న అతని భార్యపై దాడి చేసి హత్య చేశాడు. ఊర్లో అందరూ గ్రామ దేవతకు కోళ్లు, పొటేళ్లు బలి ఇస్తే ఇక్కడ ఓ భర్త అతని భార్యను గ్రామ దేవతకు బలి ఇవ్వడం కలకలం రేపింది.

గ్రామ దేవత జాతర సందర్భంగా ఊర్లో వాళ్లు, బందువులు అందరూ గుడి దగ్గరకు బంధువుల ఇళ్లకు తిరుగుతూ చాలా బిజీగా ఉన్నారు. ఆ సందర్బంలో మద్యం మత్తులో ఉన్న భర్త ఇంటికి వెళ్లి అతని ర్యపై దాడి చేశాడు. భర్త దాడి చెయ్యడంతో అతని భార్య గట్టిగా కేకలు వేసింది. డ్రమ్స్ సౌండ్స్, పలకల సౌండ్ కు ఆ మహిళ చేస్తున్న ఆర్తనాదాలు చుట్టుపక్కల వాళ్లకు ఏమాత్రం వినపడలేదు. చెవిలో రక్తస్రావం కావడంతో భార్య కుప్పకూలింది.
తలపై, చెవిపై బలమైన దెబ్బ తగిలి ఆమె మృతి చెందిన ఘటన కర్ణాటకలోని దావణగెరె తాలూకా శిరంగొండనహళ్లిలో చోటుచేసుకుంది. అర్పితా (24) అనే మహిళ ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. హనమంత (28) అనే యువకుడు అతని భార్యను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి శిరమగొండనహళ్లిలో గ్రామదేవత జాతర జరుగుతుంది. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే గ్రామదేవత ఉత్సవాలను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు.
ఐదేళ్ల తర్వాత వచ్చిన గ్రామదేవత ఉత్సవాలకు అన్ని ఇళ్లలో సన్నాహాలు చేశారు. అన్ని ఇళ్లలో మాంసాహార భోజనం కూడా వడ్డిస్తారు. జాతర అనంతరం మద్యం మత్తులో ఉన్న హనుమంత ఇంట్లో చిన్న కారణానికి భార్య అర్పితాతో గొడవ పడ్డాడు. అయితే ఆ గొడవ కాస్తా పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో హనుమంత అతని భార్య అర్పితా మీద దాడి చెయ్యడంతో ఆమె మృతి చెందింది. నా భార్య అర్పితాను తాను గ్రామ దేవతక బలి ఇచ్చానని హనుమంత మద్యం మత్తులో కేకలు వేశాడని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు.
హనుమంతు, అర్పిత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. నిందితుడు హనుమంతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications