విదేశాల్లో ఉద్యోగం, ఊర్లో యువకుడి నగ్న వీడియోలు వైరల్, సెలవుల్లో వచ్చి !
బెంగళూరు/శివమొగ్గ: బాగా చదువుకున్న యువకుడు కొంతకాలం సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేశాడు. తరువాత విదేశాల్లో ఉద్యోగం రావడం, లక్షల రూపాయల జీతం కావడంతో అతను విదేశాలకు వెళ్లాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడి నగ్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సొంత జిల్లా అయిన శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళి తాలుకాలోని ఓ గ్రామంలో స్వరూప్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బాగా చదువుకున్న స్వరూప్ కు బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిన అతను కొంతకాలం ఉద్యోగం చేశాడు.

బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువకుడు ప్రతినెల రెండు మూడు రోజులు సొంత ఊరికి వెళ్లి అతని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటూ తరువాత బెంగళూరులో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లేవాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న స్వరూప్ సుమారు 8 నెలల క్రితం శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి సమీపంలోని అతని ఊరికి వెళ్లాడు.
సుమారు నెల రోజులకు పైగా ఊరిలో ఉన్న స్వరూప్ తరువాత ఉద్యోగం చెయ్యడానికి విదేశాలకు వెళ్లిపోయాడు. విదేశాల్లో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న స్వరూప్ ప్రతిరోజు అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇటీవల స్వరూప్ కు అతని స్నేహితులు ఫోన్ చేసి రేయ్ కొంపమునిగిపోయిందిరా అని చెప్పారు.
అప్పటికే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న స్వరూప్ నగ్న వీడియోలు వాట్సాప్ గ్రూప్ ల్లో వైరల్ అయ్యాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న స్వరూప్ కు ఎవరో వల వేసి అతన్ని ముగ్గులోకి దింపి అతని రొమాన్స్ చేసే సమయంలో అతని నగ్న వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్ ల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న స్వరూప్ కు ఎవరో వల వేసి అతనితో రొమాన్స్ చేసి సీక్రేట్ గా వీడియోలు తీసి ఆ వీడియోలతో అతన్ని బ్లాక్ మెయిల్ చేసి ఉంటారని, స్వరూప్ లొంగకపోవడంతో అతని నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి ఉంటారని తీర్థహళ్ళి తాలుకా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఈ వీడియో ఆరు నెలల క్రితం రికార్డు చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. గతంలో తీర్థహళ్ళికి చెందిన ఇద్దరు యువకుల నగ్న వీడియోలు ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ చేశారని స్థానికులు అంటున్నారు. ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడి వీడియో ఇలాగే వైరల్ కావడంతో ఇంకో సారి ఎవరి వీడియో చూడాల్సి వస్తుందో అంటూ స్థానికులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications