Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో చిక్కిన చిరుత, ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఎలా చిక్కిందంటే ?

బెంగళూరు: మూడు రోజుల నుంచి బెంగళూరులో చుక్కలు చూపిస్తున్న చిరుత చివరికి చిక్కింది. నిరంతర ఆపరేషన్ చిరుతలో భాగంగా కూడ్లు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకోవడంలో బెంగళూరు అటవీశాఖ అధికారులు విజయం సాధించారు. బెంగుళూరు శివార్లలో అనేక సార్లు చిరుతలు కనిపించడంతో అటవీ శాఖా అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.

చిరుత కదలికలను నిశితంగా పరిశీలించిన తర్వాత దానిని బంధించడానికి బోనులు ఏర్పాటు చేశారు. బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని సింగసంద్రలోని ఏఈసీఎస్ లేఅవుట్‌లో రద్దీగా ఉండే ప్రాంతంలో కూడ్లు గేట్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో చిరుతపులి కనిపించడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి బోనులు ఏర్పాటు చేశారు.

A Leopard trapped in the ever-crowded Bommanahalli industrial area of Bengaluru.

చిరుతపులిని రక్షించేందుకు భారత్‌నగర్‌లోని ఓ రాయి క్వారీ దగ్గర వ్యూహాత్మకంగా రెండు బోనులు ఏర్పాటు చేసినట్లు బెంగళూరు రూరల్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంకే. రవీంద్ర తెలిపారు. ప్రజలను బెదిరిస్తూ సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు డ్రోన్ టెక్నాలజీతో పాటు నిఘా కెమెరాలు, 30 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని రంగంలోకి దింపారు.

బుధవారం అటవీశాఖ సిబ్బంది వెంటనే పలు ప్రాంతాల్లో చిరుత కోసం గాలించారు. ఆనేకల్ తాలూకాలో, సిల్క్ బోర్డు సమీపంలోని బొమ్మనహళ్లిలో కూడ్లు గేట్ సమీపంలోని కృష్ణారెడ్డి లేఔట్ లో నిర్మాణంలో ఉన్న భవనంలో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అటవీశాఖ సిబ్బంది చిరుతపులికి మత్తు మందు అందించడంతో చిరుత భవనంలోని ఒక భాగం నుంచి మరో భాగంపైకి దూకి వైద్యుడిపైనా దాడి చేసింది.

అటవీశాఖ సిబ్బందిపైనా దాడి చేసిన చిరుత తప్పించుకుంది. బుధవారం సాయంత్రం బోమ్మనహళ్లిలోని ఇండస్ట్రియల్ లో అటవీశాఖ అధికారులు వేసిన వలలో చిరుత చిక్కింది. అటవీ శాఖ సిబ్బంది చిరుతను పట్టుకుని బన్నేరుఘట్ట పార్కుకు తరలించారు. మూడు రోజుల నుంచి తప్పించుకుని ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+