ఈయన జైలర్ అవునా ? కాదా ?, సూపర్ స్టార్ రజనీకాంత్ కే షాక్ ఇచ్చిన ప్రభు ఎవరు ?, వైరల్ అంతే!
చెన్నై/తిరువనంతపురం: ఇండియన్ సినిమాల్లో ఏ స్టార్ నటుడిని చూసినా ఆయనలా కనిపించేవాళ్లు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిని ఆ స్టార్ హీరో జూనియర్స్, డూప్స్ అని పిలుస్తారు. ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ లాగా ఉన్న వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తలైవా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సౌత్ ఇండియా సూపర్ స్టార్, స్టైల్ కు పెట్టింది పేరుగా రికార్డుల్లో నిలిచిన రజనీకాంత్‌ను పోలి ఉండే ఈ వ్యక్తిని సుధాకర్ ప్రభుగా గుర్తించారు. రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నారు. అయితే అచ్చం రజనీకాంత్ లాగా ఉండే సుధాకర్ ప్రభుకు, సినిమాలకు ఎలాంటి సంబందం లేదు. అసలు ఆయన ఇంత వరకు రజనీకాంత్ ను నేరుగా కలిశారంటే అంటే అదిలేదు.

కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో ఈ సుధాకర్ ప్రభు సొంతంగా ఓ టీ దుకాణం నడుపుతున్నాడు. అచ్చం తలైవా రజనీకాంత్ ను పోలి ఉంటాడు. ప్రపంచంలో ఒకరిలాగే ఏడుగురు ఉన్నారని పెద్దలు చెప్పడంతో మనం నమ్ముతున్నాము. జనాదరణ పొందిన వ్యక్తులు, సెలబ్రిటీల విషయానికి వస్తే వారి రూపాన్ని పోలి ఉన్న వారిని మనం చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.
మన అభిమాన తారలను పోలిన వారిని గుర్తించడం మనకు ఎంతో ఆసక్తిగాను ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, ప్రపంచ దేశాల్లో కూడా లక్షలాది మంది అభిమానులను సంపాధించుకున్న రజనీకాంత్‌ను పోలిన సుధాకర్ ప్రభు అనేఓ వ్యక్తి వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారడటం దుమారం రేపింది.
ఫోర్ట్ కొచ్చిలోని పట్టాళం రోడ్డులో టీ దుకాణం నడుపుతున్న సుధాకర్ ప్రభు అచ్చం సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పోలి ఉండడంతో ఇంటర్నెట్‌లో ఆయన ట్రెండింగ్‌లో ఉన్నారు. వైరల్‌గా మారిన వీడియోలో సుధాకర్ ప్రభు ఒక షార్ట్, టీ షర్ట్ ధరించి కొంతమంది వ్యక్తులతో మాట్లాడటంతో పాటు రజనీకాంత్ లాగా ఆయన తీరును అనుకరించడం హాట్ టాపిక్ అయ్యింది.

సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ పోలికలతో ఉన్న సుధాకర్ ప్రభును మలయాళ నటుడు,-దర్శకుడు నాదిర్షా గుర్తించారు. తన సినిమా షూటింగ్ కోసం ఫోర్ట్ కొచ్చి ఉంటున్న ఆయన మొదట సుధాకర్ ప్రభును చూసి ఆశ్చర్యపోయాడని తెలిసింది. ఫోర్ట్ కొచ్చికి చెందిన సుధాకర ప్రభు పోలికలు పేరుకు సంపన్నుడైనా టీ దుకాణం నడుపుతున్నాడని ఆ దర్శకుడు అతని ఫేస్ బుక్ లో రాసుకున్నాడు.
ఇదే సమయంలో అచ్చం రజనీకాంత్ లాగా ఉన్న సుధాకర్ ప్రభుతో పలు ఫోటోలు తీసుకున్న మళయాలం దర్శకుడు, నటుడు నాదిర్జా ఆ ఫోటోలు, వీడియోలను అతని ఫేస్‌బుక్‌లో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు రజనీకాంత్ లాగా ఉండే సుధాకర్ ప్రభును కేరళ అంతటా వివిధ ఈవెంట్‌లు, ఫంక్షన్‌లకు ఆహ్వానించబడుతున్నాడు. గత సంవత్సరం పాకిస్తాన్ ప్రభుత్వ రిటైడ్ ఉద్యోగి రజనీకాంత్ లాగా ఉండటంతో అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications