ఆస్తికోసం తల్లి నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేసిన తనయుడు .. కేసు నమోదు

ఆస్తి కోసం ఒక ప్రబుద్ధుడు అమ్మ ఆత్మాభిమానాన్నే అభాసుపాలు చేశాడు . తల్లి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు . తమ పూర్వీకుల నుండి వచ్చిన ఇంటి పత్రాలను తనకు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసిన సదరు కొడుకు వృద్ధురాలైన తల్లి నగ్న చిత్రాలను వారి బంధువులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు . తీవ్ర మనోవేదన చెందిన తల్లి పోలీసులను ఆశ్రయించగా నిందితుడు దీపక్ తివారీని అరెస్ట్ చేసి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఎసిజెఎం) ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

ఇక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిందితుడి తండ్రి 20 రోజుల క్రితం కన్నుమూశారు. ఇక దీంతో ఇంటిపై వివాదం తలెత్తిందని, తల్లిని ఆస్తి కోసం తనయుడు వేధించాడని పోలీసులు తెలిపారు. 75 ఏళ్ల మహిళ మే 13 న తన కొడుకు తన విషయంలో చేసిన దారుణంపై ఫిర్యాదు ఇచ్చారని పేర్కొన్నారు . తన కొడుకు వచ్చి తనపై కొంత ఏదో పదార్ధం స్ప్రే చేశాడని దాంతో వొళ్ళంతా దురద అనిపించటంతో ఆమె ఆ బట్టలు తీసి స్నానం చేయడానికి బాత్రూంకు చేరుకుంది.

A man blackmailed his mother with nude pictures for property

ఆమె కుమారుడు ఆమె స్నానం చేస్తున్న సమయంలో ఫోటోలను రహస్యంగా క్లిక్ చేసి, మెసేజింగ్ ప్లాట్‌ఫాంపై ఉన్న వారి బంధువులకు పంపించాడని పోలీసులు తెలిపారు.ఈ సంఘటన గురించి తన బంధువులు ఫోటోలను అందుకున్నట్లు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళ మరుసటి రోజు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. దీంతో తల్లి నగ్న చిత్రాలు షేర్ చేసిన దీపక్ తివారీని అరెస్టు చేశారు.ఆమె పరువు తియ్యాలని ఈ పని చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+