Marriage: ఎన్నికల్లో పోటీ చేయడానికి 45 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న నాయకుడు..
పదవితో ఏం వచ్చినా రాకున్నా చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ప్రయత్నం చేస్తుంటారు. గెలవడానికి సాయశక్తుల కృషి చేస్తారు. అప్పు చేసి మరి ఖర్చు పెడుతుంటారు. పదవి కోసం ఏమైన చేస్తుంటారు. ఇలా ఓ వ్యక్తి పదవి కోసం నామినేషన్ కు ముందు పెళ్లి చేసుకోనున్నాడు. అస్సుల్లో ఎన్నికల్లో గెలవడానికి, పెళ్లికి సంబంధం ఏముందని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త చదవాల్సిందే. . ఉత్తర్ప్రదేశ్ లోని రాంపుర్ చెందిన ఓ నాయకుడు.. ఎన్నికల్లో గెలిచి పదవి పొందేందుకు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఉత్తర ప్రదేశ్ లోని రాంపుర్ మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అందుకు సంబంధించి అధికారులు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
నామినేషన్ వేయడానికి ఏప్రిల్ 17వ చివరి తేదీగా ఉంది. రాంపూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు 45 ఏళ్ల మామూన్ షా ఖాన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ గెలిచి అధ్యక్ష పదవికి చేపట్టాలనుకున్నారు. అందుకు ఆయన ఆరు నెలల ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టారు. అయితే అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ లో రాంపూర్ మున్సిపాలిటీ అధ్యక్ష పదవిని మహిళకు కేటాయించారు. దీంతో మామూన్ షా ఖాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకంటే అయన అప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే మున్సిపాలిటీ అధ్యక్ష పదవి ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నారు.

తనవారితో కలిసి చర్చించారు. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహం అనంతరం భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించాడు. 45 గంటల్లోనే అమ్మాయిని వెతికారు. ఎట్టకేలకు ఓ అమ్మాయి మామూన్ షా ఖాన్ ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. మామూన్ షా ఖాన్ ఏప్రిల్ 15న ఘనంగా పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి అయిన వెంటనే మామూన్ భార్య నామినేషన్ దాఖలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications