Viral Video: హెల్మెట్ పెట్టుకునే వారి కోసమే ఈ వీడియో..

ద్విచక్ర వాహనం వెళ్లేవారిలో చాలా మందికి హెల్మెంట్ పెట్టుకోవడమంటే ఇష్టముండదు. కొందరేమో ఫైన్ పడుతుందన్న భయంతో హెల్మెట్ పెట్టుకుంటారు. మరి కొందరు ముందు జాగ్రత్తతో హెల్మెట్ పెట్టుకున్నారు. ఇంకొదరైతే హే హెల్మెట్ ఎవరు పెట్టుకుంటారని పెట్టుకోకుండా వెళ్లిపోతారు. ఎన్నిసార్లు ఫైన్ పడినా కడతారు కానీ హెల్మెట్ పెట్టుకోరు. కొందరైతే పక్క గల్లీలోకి వెళ్లడానికి హెల్మెట్ ఎందకుని అంటారు. కానీ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది హెల్మెంట్ ప్రాముఖ్యత.

బస్సు

బస్సు


ఈ వీడియోలో ఓ బస్సు వస్తూ ఉంటుంది. బస్సుకు ఎదురుగా వచ్చిన వ్యక్తి స్పీడ్ గా వచ్చి అదుపు తప్పి బస్సు టైర్ల కింద పడతాడు. కానీ అతనికి తలం ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. దానికి కారణం అతను హెల్మెట్ పెట్టుకోవడమే. అతని హెల్మెట్ పగలగా.. అతనికి స్పల్వ గాయాలయ్యాయి. అతనే బస్సు కింది నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు.

5 లక్షలకు పైగా వ్యూస్

5 లక్షలకు పైగా వ్యూస్


ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను తాన్సుయోగెన్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోతో పాటు ఓఎంజీ, అతను బతికున్నాడని భావిస్తున్న అని రాసుకొచ్చాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 7 వేలకు పైగా లైక్స్.. 18 వందలకు పైగా రీట్వీట్లు చేశారు.

హెల్మెంట్ బ్రాండ్

హెల్మెంట్ బ్రాండ్

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అతను పెట్టుకున్న హెల్మెంట్ బ్రాండ్ ఏమిటి అని అడుగుతున్నారు. హెల్మెంట్ పెట్టుకోని వారికి ఈ వీడియో చూపించండని కోరుతున్నారు. రోవైపు.. ఆ హెల్మెట్‌ తయారు చేసిన సంస్థనే ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

మద్యం తాగి


ఏదీ ఏమైనప్పటికీ హెల్మెంట్ పెట్టుకోవడమనేది చాలా ముఖ్యం. బండి డ్రైవ్ చేసే వారు మాత్రమే కాదు.. వెనకాల కూర్చున్న వారు కూడా హెల్మెంట్ పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే అతి వేగం వద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా తాగి వాహనం నడపొద్దని కోరుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+