ఐటీ హబ్ వచ్చింది ఎందుకు ?, కూతుర్ని తల్లి చంపింది ఎందుకు ?, ఇంట్లో టెక్కీ భార్య !

ఐటీ హబ్ బెంగళూరు చేరుకుంటే ఏదో ఒకపని చేసుకుంటూ జీవనం సాగిస్తామని, బెంగళూరులో ఏదో ఒకపని చిక్కుతుందని చాలా మంది అనుకుంటారు. బెంగళూరు చేరుకున్న తరువాత అష్టకష్టాలు పడి జీవనం సాగిస్తున్న వాళ్లు ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఉన్నారు. అయితే పొరుగు రాష్ట్రం నుంచి బెంగళూరు వచ్చిన వివాహిత మహిళ ఆమె కూతుర్ని హత్య చేసి తరువాత ఆమె గొంతు కోసుకోవడం కలకలం రేపింది.

కుటుంబ కలహాల నేపథ్యంలో రెండేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసి తల్లి తరువాత ఆత్మహత్యకు యత్నించిన దారుణ ఘటన బెంగళూరు నగరంలోని కేఆర్‌పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

A married woman who killed her daughter and then attempted suicide in Bengaluru

సీగేహళ్లిలో నివాసముంటున్న లక్ష్మీనారాయణ కుమార్తె శృతిక(2) అనే అమ్మాయి ఆమె తల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఆత్మహత్యకు యత్నించిన మృతురాలు శృతిక తల్లి చిన్నా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కేఆర్ పురం సమీపంలోని సీగేహళ్లిలోని తన ఇంట్లో కూతురు శృతికను హత్య చేసిన తరువాత ఆమె తల్లి చిన్నా కత్తితో గొంతు కోసి ఆత్మహత్యకు యత్నించినట్లు కేఆర్ పురం పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన లక్ష్మీనారాయణ మూడు నెలల క్రితం ఉద్యోగం చెయ్యడానికి బెంగళూరు నగరానికి వచ్చాడు. అనంతరం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన లక్ష్మీనారాయణ అతని భార్య చిన్నా, కుమార్తెతో కలిసి సీగేహళ్లిలో నివాసం ఉంటున్నాడు.

ఇటీవల కుటుంబ సమస్య కారణంగా లక్ష్మీనారాయణ, చిన్నా దంపతుల మధ్య గొడవ జరిగింది. అలాగే అతని భార్య చిన్నా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ రెండు కారణాలతో మనస్థాపానికి గురైన చిన్నా ఆమె కూతురిని హత్య చేసి ఆత్మహత్యకు ప్లాన్ చేసింది. అదేవిధంగా సాయంత్రం భర్త ఇంటి నుంచి వెళ్లిన తర్వాత చిన్నా ఆమె కూతుర్ని హత్య చేసి తరువాత ఆత్మహత్యకు యత్నించింది.

కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీనారాయణ భార్య చిన్నా చూసి హడలిపోయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ యూనిట్‌లో ఆమె ప్రాణాలతో పోరాడుతోందని, కేసు విచారణలో ఉందని బెంగళూరులోని కేఆర్ పురం పోలీసులు తెలిపారు. లక్ష్మీనారాయణతో పాటు అతని కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+