Bengaluru: స్కూల్ కు వెలుతున్న అమ్మాయితో మాట్లాడాలని మెకానిక్ షెడ్ లోకి వెళ్లి ?
ఉదయం యథావిధిగా పాఠశాలకు బయలుదేరింది. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన నిందితుడు నీతో మాట్లాడాలి అంటూ బాలికను నమ్మించి అతను పనిచేస్తున్న గ్యారేజీ లోపలికి తీసుకెళ్లి బాలిక ముఖం, శరీరం మీద చేతులతో తాకి అసభ్యంగా ప్రవర్తించాడు.
బెంగళూరు: అమ్మాయిలకు రక్షణ లేకుండా పోవడంతో కూతుర్లను కన్న తల్లిదండ్రులకు కంటిమీద కనుకులేకుండా పోయింది. వయసుతో తేడా లేకుండా కొందరు కామాంధులు అత్యాచారం చేస్తున్నారు. కామాంధుల దెబ్బతో పసిపిల్లలు సైతం లైంగిక వేధింపులకు గురౌతున్నారు. ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నా కామాంధులు మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
బెంగళూరు నగరంలో చిన్నారులపై అత్యాచారాల కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.ఎనిమిది ఏళ్ల బాలికపై కామాంధుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వివేకనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమ్మాయిని నమ్మించిన కామాంధుడు ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

గ్యారేజీలో పనిచేస్తూ లైంగిక వక్రబుద్ధిని పెంచుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ కోసం బెంగళూరుకు వచ్చి ఈజీపురలో నివసిస్తున్నారు. వేధింపులకు గురైన బాలిక 2వ తరగతి చదువుతోంది. ఉదయం యథావిధిగా పాఠశాలకు బయలుదేరింది. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన నిందితుడు నీతో మాట్లాడాలి అంటూ బాలికను నమ్మించి అతను పనిచేస్తున్న గ్యారేజీ లోపలికి తీసుకెళ్లాడు.
అనంతరం బాలిక ముఖం, తదితర చోట్ల చేతులు వేసి అమ్మాయిని తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక నిందితుడి నుంచి తప్పించుకుని ఏడుస్తూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని ఆమె తల్లికి చెప్పింది. తన కూతురిపై హింస, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి మీద చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక తల్లి వివేక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించిన నిందితుడు ఫిరోజ్‌ఖాన్‌ను వివేక్ నగర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications