బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే బిజీబిజీ, కుర్చీ పక్కనే పేలిపోయిన నాటు బాంబు ? హత్యాయత్నం, మహిళలకు !

బెంగళూరు: బెంగళూరు నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీద పేలుడు వస్తువు విసరడంతో అది పేలి పలువురికి గాయాలైనాయి. నాటు బాంబు విసరడం వలనే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాయాలైనాయని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. గాయాలైన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే

కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే

బెంగళూరు నగరంలోని వివేక్ నగర్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి శాంతినగర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎన్.ఎ. హ్యారిస్ హాజరైనారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఎన్.ఎ. హ్యారిస్ కుర్చున్న ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఎమ్మెల్యే హ్యారిస్ తో పాటు నలుగురికి గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కాలి తొడ, చెవి తదితర భాగాల్లో గాయాలు కావడంతో ఆయన్ను ఫిలోమినా ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ సీ అధికారులు పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్లాస్టిక్ కవర్ విసిరేశారు

ఫ్లాస్టిక్ కవర్ విసిరేశారు

ఈ ఘటనపై ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు నెలపాడ్ మీడియాతో మాట్లాడారు. మా నాన్న కార్యక్రమానికి హాజరై కుర్చీలో కుర్చున్నారని, ఆ సమయంలో పచ్చ రంగు ఫ్లాస్టిక్ కవర్ ఆయన పక్కకు విసిరివేశారని అన్నారు. హ్యారిస్ పక్కన కుర్చున్న మా అనుచరుడు మోహన్ మీద ఆ కవర్ పడిందని, తరువాత కిందపడి అది పేలిపోయిందని నలపాడ్ వివరించారు.

కార్పొరేటర్ పనే ?

కార్పొరేటర్ పనే ?

గుర్తు తెలియన వస్తువు పేలిపోవడంతో ఎమ్మెల్యే హ్యారిస్, ఆయన అనుచరులు మోహన్, చిట్టిబాబు, సంపత్ కు గాయాలైనాయి. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న మహిళలకు గాయాలైనాయి. ఈ ఘటన వెనుక హున్నారపేట్ వార్డు కార్పొరేటర్ శివకుమార్ హస్తం ఉందని ఎమ్మెల్యే హ్యారిస్ అనుచరులు ఆరోపిస్తున్నారు.

నాకేం సంబంధం ?

నాకేం సంబంధం ?

ఎమ్మెల్యే హ్యారిస్ ఉన్న ప్రాంతంలో పేలుడు జరిగిన సంఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని హున్నార్ పేట్ వార్డు కార్పొరేటర్ శివకుమార్ అంటున్నారు. తనకు, ఎమ్మెల్యే హ్యారిస్ కు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవని, ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానని, కావాలనే తన మీద నిందలు వేస్తున్నారని శివకుమార్ ఆరోపించారు. నాటు బాంబు విసరడం వలనే ఎమ్మెల్యే హ్యారిస్ తో పాటు పలువురికి గాయాలైనాయని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. పేలుడుకు మాత్రం కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+