బావిలో పడిన పిల్లిని కాపాడిన కోతి; అందరూ ఆలోచించేలా చేస్తున్న వీడియో వైరల్!!
సాటి మనిషి కష్టాల్లో ఉంటే కాపాడడం మానేసి, సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న రోజులివి. మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతున్న రోజులివి. రక్త సంబంధాలకు, మానవ అనుబంధాలకు అర్థం లేకుండా మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్న రోజులివి. ఇక ఇటువంటి సమయంలో ఒక కోతి చేసిన పని ప్రతిఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. ఒక జంతువుకున్న పాటి విచక్షణ, జ్ఞానం కూడా మనకు లేదా అని ఆలోచించేలా చేస్తోంది.
ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఒక పిల్లిని ఒక కోతి కాపాడటానికి చేసిన ప్రయత్నం, కోతి పిల్లి మీద చూపించిన ప్రేమ, దయ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. సాటి జీవి పట్ల కోతికున్న పాటి జాలి కూడా అన్నీ తెలిసిన, చదువు, జ్ఞానం ఉన్న మనుషులలో లేకపోవడం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో బావిలో పడిన పిల్లిని కోతి రక్షించటం కనిపిస్తుంది. బావిపై కోతి అటు ఇటు తిరుగుతున్న సమయంలో బావిలో ఒక పిల్లిని చూసింది. బావిలో పడిన పిల్లి బయటపడటానికి ప్రయత్నం చేసి చేసి అలిసిపోయి ఇక తాను బయటపడనేమో అన్న నిరాశ నిస్పృహలో కనిపిస్తుంది. దీంతో ఆ పిల్లి పరిస్థితి పట్ల జాలిపడిన కోతి బావిలోకి దూకింది.
బావిలో నీళ్ళు లేకపోవడం వల్ల బావి మొత్తం బురదగా ఉండటం వల్ల ఆ బావిలో అవి రెండూ మునిగిపోయే అవకాశం లేదని గుర్తించిన కోతి, పిల్లిని బావిలో నుండి పైకి వేయడం కోసం చాలా ప్రయత్నం చేసింది. కానీ కోతి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, పిల్లిని పైకి లేపలేకపోయింది. పిల్లిని కాపాడటం కోసం కోతి దానికి సాధ్యమైన అన్ని మార్గాలను ప్రయత్నించింది.
Witness the most heartwarming monkey rescue ever! 🐵❤️ pic.twitter.com/IaRgWUzwUz
— Tansu YEĞEN (@TansuYegen) April 16, 2023
ఇక చివరగా అటుగా వెళుతున్న ఒక మహిళ పిల్లిని బయటకు పంపించడం కోసం కోతి చేస్తున్న ప్రయత్నం చూసి పిల్లిని బయటకు లాగింది. ఒకటిన్నర నిమిషాలపాటు ఉన్న ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. తన జాతి కాకపోయినప్పటికీ ఒక జీవి కష్టంలో ఉంటే కోతి పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది. పిల్లిపై కోతి చూపించిన ప్రేమ, దయ ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మనకంటే కోతి నయం అంటూ, కోతి చూపించిన ఔదార్యానికి ఉబ్బితబ్బిబ్బయ్యారు.












Click it and Unblock the Notifications