కుమార్తె లవ్ స్టోరీ తల్లికి తెలిసింది: నట్టింటిలో చీల్చేసింది, హాయిగా ఓ మూల కుర్చోని !

వేరే కులం యువకుడిని ప్రేమించిన పాపానికి ఓ యువతి కన్న తల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణం సమీపంలో జరిగింది. కోలారు తాలుకాలోని చిన్నాపుర గ్రామంలో నివాసం

బెంగళూరు: వేరే కులం యువకుడిని ప్రేమించిన పాపానికి ఓ యువతి కన్న తల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణం సమీపంలో జరిగింది. కోలారు తాలుకాలోని చిన్నాపుర గ్రామంలో నివాసం ఉంటున్న రాజేశ్వరి (18) అనే యువతి హత్యకు గురైయ్యింది.

రాజేశ్వరి సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారని సమాచారం. గ్రామం సమీపంలోని ఓ చెట్టుకింద రాజేశ్వరి, ఆమె ప్రియుడు కుర్చుని మాట్లాడుకుంటున్నారు.

A Mother allegedly Killed her daughter in Kolara after she fell in love with the local boy

చిన్నాపుర గ్రామస్తులు విషయం గుర్తించి రాజేశ్వరి తల్లి వెంకటమ్మకు విషయం చెప్పారు. ఇంటికి వచ్చిన కుమార్తె రాజేశ్వరిని ఆమె తల్లి వెంకటమ్మ ప్రశ్నించింది. ఎవరితో తిరుగుతున్నావు అంటూ కుమార్తెతో గొడవ పెట్టుకుంది. తరువాత సహనం కొల్పోయిన వెంకటమ్మ సమీపంలోని పెద్ద కర్ర తీసుకునింది.

కుమార్తె రాజేశ్వరి తల మీద బలంగా దాడి చెయ్యడంతో తల చీలిపోయింది. తల ముక్కలు కావడంతో రాజేశ్వరి సంఘటనా స్థలంలోనే మరణించింది. ఇళ్లు మొత్తం రక్తం మరకలు అయ్యాయి. కుమార్తె రాజేశ్వరిని హత్య చేసిన వెంకటమ్మ ఎలాంటి బాధలేకుండా ఇంటిలోనే ఓ మూల కుర్చుంది.

విషయం తెలుసుకున్న కోలారు గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంకటమ్మను అరెస్టు చేశారు. పరువు హత్య కేసు నమోదు చేశామని, రాజేశ్వరి మృతదేహాన్ని కోలారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+