కులాన్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్: కొనుక్కోవడానికి ఎగబడుతోన్న పొలిటిషియన్స్..
ఆయా కులాలకు చెందిన ప్రజల వివరాలను అందించే సాఫ్ట్ వేర్ ను ఓ కంపెనీ రూపొందించినట్టుగా తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కులమతాల ప్రాతిపదికన ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయవద్దని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కులాన్ని సైతం బహిర్గతం చేసే ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లో పొందుపరిచిన డేటాను విశ్లేషించి.. ఆయా కులాలకు చెందిన ప్రజల వివరాలను అందించే సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్టుగా తెలుస్తోంది. ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ దీనికి రూపకల్పన చేసినట్టుగా చెబుతున్నారు.
త్వరలో బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి 80 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఒక్క కుల ప్రాతిపదికన మాత్రమే గాక అడ్రసును బట్టి, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నది కూడా ఈ సాఫ్ట్ వేర్ వివరాలు అందిస్తుందట.

ఆయా వార్డుల్లోని సామాజిక వర్గాల లెక్కలను బేరీజు వేసుకుని తద్వారా రాజకీయ వ్యూహాలను ప్లాన్ చేసుకునేందుకు అక్కడి నేతలు ప్రయత్నిస్తున్నారు. సెర్చబుల్ డేటాబేస్ కన్వర్ట్ చేసే ఈ సాఫ్ట్ వేర్ ఇప్పుడు ముంబై వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లోను త్వరలోనే ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. అక్కడి అభ్యర్థులు కూడా ఈ సాఫ్ట్ వేర్ కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇలాంటిదేది తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications