భయంకరమైన తుఫానులో ఒకదానికొకటి రక్షణగా పక్షులజంట; వైరల్ వీడియోలో శక్తివంతమైన సందేశం!!
మీ జీవితంలో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే, మీరు మిమ్మల్ని అదృష్టవంతులుగా పరిగణించాలి. అసలు ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నామంటే ఒక పక్షుల జంట భయంకరమైన తుఫానులో చిక్కుకుని, ఒకదానికొకటి రక్షించుకోడానికి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు అందరి జీవితాలలో, తమ కోసం ఎవరైనా ఉన్నారా? అన్న ఆలోచనను రేకెత్తించింది.
భయానక తుఫానులో ఒకరికి ఒకరుగా కాపాడుకుంటున్న పక్షుల జంట వీడియో
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రెండు పక్షుల జంట వీడియో ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది. భయంకరమైన తుఫానులో రెండు పక్షులు ఒకదానికొకటి రక్షించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, భయానకమైన తుఫాను సమయంలో రెండు పక్షులు తీగపై కూర్చుని అవి రెండూ ఒకదానినొకటి ఎలా కాపాడుకుంటున్నాయి అనేది ఆ వీడియో లో చూడవలసిన అత్యంత హృద్యమైన విషయం.
ప్రతీ ఒక్కరూ అలోచించేలా ఉన్న పక్షుల జంట వీడియో
వీడియో లో పక్షుల జంట ఒక దాని రెక్కలు ఇంకొక దానికి కప్పుతూ, భయానక తుఫాను నుండి ఒకదానినొకటి కాపాడుకునే ప్రయత్నం చేశాయి. జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా, నిజంగా సొంతమని భావించేవారు భయంకరమైన కష్టాలలో కూడా కలిసి ఉంటారని ఈ పోస్టు ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా. రోజురోజుకూ మృగ్యంగా మారుతున్న మానవ సంబంధాలను పక్షుల జంట ప్రేమను చూపించి సరిదిద్దే ప్రయత్నం చేశారు.
నిజమైన ప్రేమ జంట.. నెటిజన్ల స్పందన
ప్రపంచంలోని అన్ని ప్రేమపూర్వక సంబంధాలలో ఒకరినొకరు రక్షించుకుంటున్నారు మరియు ఒకరికొకరు అండగా ఉంటారు, దయచేసి ఆ పనిని కొనసాగించండి అని దీనిని చూసిన ఒక నెటిజన్ స్పందించారు. ప్రకృతి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ మరో నెటిజెన్ స్పందించారు. పక్షులకు ఉన్న ప్రేమ ఈమధ్య మనుషుల్లో కనిపించటం లేదని కొందరు చెప్తున్నారు. జంట అంటే అలా ఉండాలని కొందరు కితాబు ఇస్తున్నారు. నిజమైన ప్రేమ జంట అని కొనియాడుతున్నారు.

భయంకరమైన తుఫానులోను బలమైన బంధం; పక్షుల జంట అందరికీ ఆదర్శం
అంతేకాదు రెండు పక్షుల జంటను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కొనియాడారు. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భయంకరమైన తుఫాను లోను బలమైన బంధాన్ని కలిగి ఉన్న పక్షుల జంట అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. మనసుని తడుముతున్న సంఘటన, ప్రతి ఒక్కరు తరచి చూసుకోవలసిన సందర్భం అని పలువురు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తున్నారు.
-
మస్క్ మామ ఇచ్చిపడేశాడు: వాట్సాప్‌కు గుడ్ బై.. XChatకు వెల్కమ్! -
సముద్రం అడుగున ఉన్న ఈ జంతువుల్లో చేప పిల్ల ఎక్కడుందో కనిపెట్టగలరా ??? -
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications