హైకోర్టులో ఆత్మహత్యాయత్నం, కోర్టు హాలులో అందరూ చూస్తున్న సమయంలోనే?
న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఓ వ్యక్తి విసిగిపోయాడని తెలిసింది. కర్ణాటక హైకోర్టులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. న్యాయమూర్తుల ఎదుట కేసు విచారణకు వచ్చిన ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో కర్ణాటక హైకోర్టులో ఉన్న వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ ఘటన బెంగళూరులోని కర్ణాటక హైకోర్టు హాల్-1లో చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి న్యాయస్థానం ముందుకు వచ్చాడు. అనంతరం కోర్టు సిబ్బంది దరఖాస్తును అందజేయడంతో సంబంధిత సిబ్బంది దానిని పరిశీలిస్తున్నారని తెలిసింది. ఆ సమయంలో అతను తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రముఖ కన్నడ టీవీ చానల్ తెలిపింది.

ప్రస్తుతం ఈ ఘటన కారణంగా వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగిందని సమాచారం. ఈ సంఘటనతో కోర్టు హాలులో ఆందోళన వాతావరణం నెలకొందని తెలిసింది. ఘటన జరగగానే అక్కడే ఉన్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. విచారణ చేపట్టాల్సిన దృష్ట్యా హైకోర్టు హాల్ 1లో రక్తంతో పడి ఉన్న చిన్న కత్తిలాంటి బ్లేడ్‌ను ఎవ్వరూ తాకవద్దని పోలీసు అధికారులు అక్కడ ఉన్న వాళ్లను ఆదేశించారు.
హైకోర్టులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మెడికల్ సీటు విషయంలో మనస్తాపం చెందిందాడని సమాచారం. ప్రస్తుతం అతడు ఇలా ఎందుకు చేశాడనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇలా నిషేధిత వస్తువులను హైకోర్టు హాలులోకి తీసుకొచ్చిన వ్యక్తులపై పోలీసులు విచారణ జరుపనున్నారు. కర్ణాటక హైకోర్టులో భద్రత లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టులో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
హైకోర్టులోకి వెలుతున్న అదర్ని తనిఖీ చేసిన తరువాత లోపలికి పంపిస్తుంటారు. హైకోర్టు ప్రధాన ద్వారం సహా ప్రతిచోటా పోలీసు సిబ్బంది ఉంటారు. ఒక వ్యక్తి బ్లేడు వంటి ఆయుధంతో హైకోర్టులోకి ఎలా రాగలిగాడు? పోలీసులు ఏం చేస్తున్నారు అని పలువురు న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు, అతను బ్లేడ్ ఎలా లోపలికి తీసుకు వచ్చాడు అనే విషయంలో విచారణలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications