Rent House: ఇదేం రూమ్‍రా నాయనా.. అక్కడే అన్నీ.. వైరల్ అవుతోన్న ఫొటో..!
మీకు హైదరాబాద్ లో 50 గజాల జాగ ఉంటే ఏం చేస్తారు. డబ్బులు లేకున్నా బ్యాంకులో లోన్ తెచ్చి మరి బిల్డింగ్ కడతారు. అయినా 50 గజాల స్థలంలో ఇల్లు ఏమవుతుందని అనుకోవచ్చు. కానీ చాలా మంది ప్రైమ్ ఏరియాల్లో జాగ ఎంతున్నా.. భవనం కట్టేస్తున్నారు. రెండు ఫోర్లు లేపుతున్నారు. ఫ్లోర్ కు రెండు సింగిల్ బెడ్ రూమ్ చేస్తున్నారు. చిన్నగా హాల్, బెడ్ రూప్, కిచెన్ ఏర్పాటు చేసి సింగిల్ బెడ్ రూమ్ అని చెప్పి అద్దెలకు ఇస్తున్నారు.
కొంత మంది ఒక రూమ్ ను రెండు రూమ్ లుగా చేసి అద్దెకు ఇస్తున్నారు. అందులోనే టాయిలెట్ వచ్చేలా చూస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో ఇలా చేస్తున్నారు. తాజాగా ఓ అద్దె ఇంటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఓ బెడ్ రూమ్ లో బాత్ రూమ్ ఉంది. ఓపెన్ లాట్రిన్ ఉంది. ఇది అటాచ్ డు బెడ్ రూమ్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది.

ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఒక చిన్న గదిలో స్నానం చేయడానికి వీలుగా గాజుతో ఒక బాతురూమ్ కట్టారు. బాత్ రూమ్ తో పాటు లాట్రిన్ కూడా ఉండాలని అక్కడే గోడ పక్కకు టాయిలెట్ సీటు అమర్చారు. ఈ ఫొటో ఒక యూజర్ రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bathroom in Bedroom.. House in Delhi's Posh Location pic.twitter.com/2BLWzJA5Gi
— Muskmelon (@gova3555) August 16, 2023
చాలా మంది ఇదేం రూమ్ రా నాయనా అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంత ఈ గదికి ఎంత అద్దె చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. రూమ్ లోనే బాత్ రూమ్, లాట్రిన్ ఆలోచన మామూలుగా లేదని అంటున్నారు.
ఏదీ ఏమైనప్పటికీ మెట్రో నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే సగం జీతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాడుతోంది. ముఖ్యంగా బెంగళూరులో అద్దె ఇల్లు దొరగడం కష్టం. ఒక వేళ దొరికిన సంవత్సరం అద్దె ముందే చెల్లించాలట.












Click it and Unblock the Notifications