Model: మంచి ప్రాజక్ట్ వచ్చింది, మోడల్ గా ఎక్కడికో వెళ్లిపోతావు, హోటల్ కు పిలిపించి ?, ఫోటోగ్రాఫర్ !

అహమ్మదాబాద్/ భోపాల్: మోడలింగ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి మోడల్ గుర్తింపు పొందాలని, తరువాత సినిమాల్లో అవకాశాలు వస్తాయని యువతి అనుకుంది. కుటుంబ సభ్యులను ఒప్పించిన ఆ యువతి వేరే రాష్ట్రానికి వెళ్లింది. మోడల్ గా మంచిమంచి అవకాశాల కోసం ఎదురుచూసింది. తన దగ్గర మంచి ప్రాజెక్ట్ ఉందని, ఆ ప్రాజెక్టు ఓకే అయితే నీకు మోడల్ గా మంచి గుర్తింపు వస్తుందని ఓ ఫోటోగ్రాఫర్ ఆమెకు చెప్పాడు. ఫోటో గ్రాఫర్ తో ఆమె టచ్ లో ఉంది, ఫోటో షూట్ ఉందని చెప్పిన ఫోటో గ్రాఫర్ ఆమెను హోటల్ కు పిలిపించుకుని ఆమె మీద అత్యాచారం చేశాడు. మ్యాటర్ బయటకు వస్తే నిన్ను చంపేస్తానని, తనకు చాలా పలుకుబడి ఉందని ఫోటో గ్రాఫర్ ఆమెను బెదిరించాడు.

మోడల్ కావాలని ఆశ

మోడల్ కావాలని ఆశ

మోడల్ కావాలనే ఆశయంతో సొంత రాష్ట్రం వదిలి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు వెళ్లిన యువతిపై ఓ ఫోటోగ్రాఫర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మోడలింగ్‌లో అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పిన ఫోటోగ్రాఫర్‌ తనపై అత్యాచారం చేశాడని నవంబర్‌లో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్‌ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

గుజరాత్ చేరుకున్న యువతి

గుజరాత్ చేరుకున్న యువతి

గత నెలలో జరిగిన అత్యాచారం కేసు ఇప్పుడు నమోదు అయ్యింది. అత్యాచారానికి గురైన మహిళ ఆరు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని తన స్వస్థలం నుండి మోడల్ కావాలనే ఆశతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వచ్చిందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పుర ప్రాంతంలోని హోటల్ లో యువతి మీద ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ ధనక్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని బాధితురాలు పిర్యాదు చేసిందని పోలీసులు అంటున్నారు.

సోషల్ మీడియా ఫ్రెండ్స్

సోషల్ మీడియా ఫ్రెండ్స్

యువతిపై అత్యాచారం చేసిన నిందితుడు ప్రశాంత్ ధనక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నవరంగపూర్‌లోని ఈశావర్ భువన్ సమీపంలోని దీప్‌కుంజ్ లోని ఓ ఫ్లాట్‌లో ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ ధనక్ నివాసం ఉంటున్నాడని పోలీులు అన్నారు. నిందితుడు ప్రశాంత్ ధనక్‌తో ఆ మహిళకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యిందని పోలీసులు అన్నారు.

ప్రాజెక్ట్ ఉందని నమ్మించాడు

ప్రాజెక్ట్ ఉందని నమ్మించాడు

కొంతకాలం తరువాత ప్రశాంత్ ధనక్, ఆ మహిళ ఫోన్ నంబర్లు మార్చుకున్నారనని, తరువాత నిత్యం టచ్ లో ఉన్నారని పోలీసులు చెప్పారు. మోడలింగ్ కల ఉన్న యువతికి మోడలింగ్‌కు సంబంధించి తన వద్ద పెద్ద ప్రాజెక్ట్ ఉందని, ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని, నీకు ఆర్థిక సహాయం చేస్తామని ఫోటో గ్రాఫర్ ప్రశాంత్ ధనక్ ఆమెకు హామీ ఇచ్చాడు.

క్లైంట్ వస్తాడని నమ్మించి హోటల్ లో ?

క్లైంట్ వస్తాడని నమ్మించి హోటల్ లో ?

యువతి ప్రశాంత్ ధనక్ ను నమ్మి ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి అహమ్మదాబాద్ నగరానికి వచ్చింది. తరువాత నవరంగ్‌పురాలో ఆమెను కలవాలని పిలిచిన ప్రశాంత్ ధనక్ నిన్ను ప్రాజెక్ట్ క్లయింట్‌ తో మాట్లాడిస్తానని నమ్మించి ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన నవంబర్ 10న అహమ్మదాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిందని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

మ్యాటర్ లీక్ అయితే చంపేస్తా

మ్యాటర్ లీక్ అయితే చంపేస్తా

హోటల్ గదిలో అత్యాచారం చేసిన నిందితుడు ప్రశాంత్ ధనక్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, విషయం బయటకు వస్తే నిన్ను చంపేస్తానని మహిళను బెదిరించారు. మహిళ ఫిర్యాదు మేరకు గుజరాత్ యూనివర్సిటీ పోలీసులు నిందితుడు ప్రశాంత్ ధనక్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. అయితే 40 రోజుల తరువాత బాధితురాలు రేప్ కేసు పెట్టడంతో ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ ధనక్ మాయం అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+