ఆరునెలల పాప అరుదైన రికార్డు!

జీవితంలో ఏదైనా సాధించాలి అని తపన పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమి సాధించలేకపోయాననీ బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక జీవితంలో ఏదైనా సాధించటం కోసం చాలా పెద్ద ఎత్తున సాహసాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. జనం అందరిలో మనం ఎవరంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని భావించేవారు, తమ సామర్థ్యాలకు పదును పెడుతూ రికార్డులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

రికార్డు సృష్టించిన ఆరు నెలల పసిపాప
అయితే ఒక ఆరు నెలల పసిపాప కూడా ఎవరు సాధించని అరుదైన రికార్డును సాధించింది. దానికోసం పెద్దగా ఎఫర్ట్ కూడా పెట్టలేదు. రికార్డే కదా అది ఎంత పని అన్నట్టు సునాయాసంగా చేసేసింది. తను ఏం చేస్తుందో కూడా తనకు తెలియని పసి బుజ్జాయి చేసిన ఆ అద్భుతమైన పని ఏంటి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

A rare record for a six-month-old baby

44 నిమిషాల 8 సెకండ్ల పాటు కూర్చుని రికార్డు
ఆరు నెలల పసిపాప అంటే కనీసం సరిగా కూర్చోవడానికి కూడా రాని వయసు. అటువంటి వయసులో ఓ బుజ్జాయి ఏకంగా 44 నిమిషాల 8 సెకండ్ల పాటు కూర్చుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కర్ణాటక రాష్ట్రం కంప్లి కి చెందిన న్యాయవాది మోహన్ కుమార్ దానప్ప, సౌమ్యశ్రీ దంపతుల రెండవ కుమార్తె అయిన ద్వితా మోహన్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చున్న ఆ బుజ్జి పాప ఏకంగా 44నిమిషాల 8సెకండ్ల పాటు కూర్చుని పోయింది. జూన్ 28వ తేదీన ఆరునెలల ఈ చిన్నారి ఎక్కువ సమయం పాటు కూర్చుని వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. పాప కూర్చోవడానికి ఎటువంటి సపోర్టు చేయకుండానే అంతసేపు కూర్చోవడం నిజంగా విశేషం. అయితే తల్లిదండ్రులు రకరకాల బొమ్మలు చేతికి ఇస్తుండగా పాప వాటితో చక్కగా ఆడుకుంది.

అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించిన బుజ్జాయి
అంతసేపు కూర్చున్నా ఎటువంటి ఇబ్బంది ఫీల్ కాకుండా చక్కగా ఆడుకున్న ఈ పసి బుజ్జాయి తనకి తెలియకుండానే వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఆరు నెలల వయసులో అంతసేపు కింద పడిపోకుండా కూర్చోవడం, ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చోవడం సాధ్యం కాదు. కానీ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపించిన ఈ బుజ్జాయి అందుకే ఓ స్పెషల్ బుజ్జాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+