Pizza girl: పిజ్జా గర్ల్ మీద మేనేజర్ కన్ను, వేరే ప్రియుడు ఉన్నాడని, ఏం చేశాడంటే, వీడియో వైరల్ !
బెంగళూరు: పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి మీద కామాంధుడైన మేనేజర్ కన్నుపడింది. అమ్మాయిని అనేక రకాలుగా హింసిస్తున్న ఆ మేనేజర్ తనను ప్రేమించాలని, లేదంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తానని టార్చర్ పెట్టాడు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడం, కరోనా వైరస్ దెబ్బతో వేరే చోట ఉద్యోగం చిక్కడం కష్టంగా మారడంతో కచ్చితంగా ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చెయ్యాల్సి ఉంది. ఇదే అదనుగా బావించిన మేనేజర్ ఆమెను మరింత టార్చర్ పెట్టాడు. నువ్వు పని సక్రమంగా చెయ్యడంలేదని ఆ అమ్మాయిని బూతులు తిడుతున్న సమయంలో ఆ మేనేజర్ ఒక్కసారిగా ఆమె ముఖం మీద దాడి చేశాడు. మేనేజర్ బలంగా కొట్టడంతో ఆ అమ్మాయి ఎగిరి పక్కకు పడిపోయింది. మేనేజర్ దాడి చెయ్యడం, ఆ అమ్మాయి కిందపడిపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది హడలిపోయారు. అమ్మాయి మీద మేనేజర్ దాడి చేస్తున్న సమయంలో అదే పిజ్జా సెంటర్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ మేనేజర్ పరారైనాడు.

డోమినోస్ పిజ్జా బ్రాంచ్ లో ఉద్యోగం
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని బసవనగుడిలోని రామక్రిష్ణ ఆశ్రమం రోడ్డులో డోమినోస్ పిజ్జా సెంటర్ ఉంది. ఈ డోమినోస్ పిజ్జా సెంటర్ లో పురుషోత్తమ్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తున్నాడు. రామక్రిష్ణ ఆశ్రమం రోడ్డులోని డోమినోస్ పిజ్జా బ్రాంచ్ లో అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు.

అమ్మాయి మీద మేనేజర్ కన్నుపడింది
డోమినోస్ పిజ్జా బ్రాంచ్ లో పని చేస్తున్న యువతి మీద కామాంధుడైన మేనేజర్ పురుషోత్తమ్ కన్నుపడింది. అమ్మాయిని అనేక రకాలుగా హింసిస్తున్న మేనేజర్ పురుషోత్తమ్ తనను ప్రేమించాలని, లేదంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తానని టార్చర్ పెట్టాడు. కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడం, కరోనా వైరస్ కారణంగా వేరే చోట ఉద్యోగం చిక్కదు అనే భయంతో ఆమె కచ్చితంగా ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది.

వాడు నాకంటే బాగున్నాడా ?
ఇదే సమయంలో మేనేజర్ పురుషోత్తమ్ కు ఓ విషయం తెలిసింది. తనను ప్రేమించడానికి నిరాకరిస్తున్న యువతి వేరే యువకుడితో తిరుగుతోందని మేనేజర్ పురుషోత్తమ్ కు తెలిసింది. ఈ విషయంపై పురుషోత్తమ్ అమ్మాయితో గొడవపెట్టుకున్నాడు. సార్ అది నా వ్యక్తిగత విషయం, దయచేసి వదిలేయండి అంటూ ఆ అమ్మాయి మేనేజర్ పురుషోత్తమ్ కు మనవి చేసింది.

చాన్స్ చిక్కిందని.... ముఖం పగలగొట్టిన మేనేజర్
మేనేజర్ పురుషోత్తమ్ ఆ అమ్మాయిని మరింత టార్చర్ పెట్టాడు. నువ్వు పని సక్రమంగా చెయ్యడంలేదని సాటి ఉద్యోగుల ముందు ఆ అమ్మాయిని బూతులు తిడుతున్న సమయంలో ఆ మేనేజర్ పురుషోత్తమ్ ఒక్కసారిగా ఆమె ముఖం మీద దాడి చేశాడు. మేనేజర్ పురుషోత్తమ్ బలంగా కొట్టడంతో ఆ అమ్మాయి ఎగిరి పక్కకు పడిపోయింది.

వీడియో క్లిప్పింగ్స్ వైరల్
మేనేజర్ పురుషోత్తమ్ దాడి చెయ్యడంతో ఆ అమ్మాయి కిందపడిపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది హడలిపోయారు. అమ్మాయి మీద మేనేజర్ పురుషోత్తమ్ దాడి చేస్తున్న సమయంలో అదే పిజ్జా సెంటర్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.
మేనేజర్ ఎష్కేప్
డోమినోస్ పిజ్జా బ్రాంచ్ మేనేజర్ పురుషోత్తమ్ అమ్మాయి మీద దాడి చేసిన సమయంలో రికార్డు అయిన క్లిప్పింగ్స్ వైరల్ కావడంతో బసవగుడి పోలీసుల కంట్లో పడింది. అయితే ఉద్యోగం పోతుందనే భయంతో ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. స్వయంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.
Recommended Video

ఉద్యోగం ఊడిపోయింది
మేనేజర్ పురుషోత్తమ్ పారిపోవడంతో మరో మేనేజర్ మహదేవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించారు. మేనేజర్ పురుషోత్తమ్ ను ఉద్యోగం నుంచి తీసేశామని డోమినోస్ పిజ్జా అధికారులు తెలిపారు. మొత్తం మీద పని చేస్తున్న చోట సాటి ఉద్యోగి మీద మేనేజర్ విచక్షణారహితంగా దాడి చెయ్యడంతో ఐటీ హబ్ లోని ప్రజలు షాక్ అయ్యారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications