స్కూల్ ప్రిన్సిపల్ రాసిన ఈ చెక్ లో పెద్ద తప్పులు ఉన్నాయ్: కనిపెట్టగలరా?

ఫొటోలో కనిపిస్తోన్న ఈ చెక్.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతగా ఏముందా చెక్ లో. అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కాస్త పరికించి చూస్తే ఇందులో ఎన్ని తప్పులు కావాలో.. అన్ని తప్పులు ఉన్నాయి. పైగా ఈ చెక్ ను రాసింది కూడా ఓ స్కూల్ ప్రిన్సిపల్ కావడం.. అందరి చూపునూ తనవైపు తిప్పుకొంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. ఆ చెక్కుపై ఉన్న అక్షరదోషాలు విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను సైతం వేలెత్తి చూపించినట్టయింది.

A Simple Cheque from Himachal Pradesh Became a Viral Due to Spelling Mistakes

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోన్‌హాట్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ చెక్ మీద సంతకం చేశారు. గెజిటెడ్ హోదా ఉండటం వల్ల గ్రీన్ ఇంక్ లో ఉన్న సంతకాన్ని చూడొచ్చు. మొత్తం 7,616 రూపాయలకు చెందిన చెక్ అది. సంఖ్యలు సరిగ్గానే ఉన్నప్పటికీ- అక్షరాలుగా రాసిన పదాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

  • 1. Seven కు బదులుగా Saven అని రాశారు.
  • 2. Thousand కు బదులుగా Thursday
  • 3. Hundred కు బదులుగా Harendra అని రాయడం ఈ చెక్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇవన్నీ కూడా ఒకే ఒక్క సెంటెన్స్ లో కనిపించడం హైలైట్. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 29న ఈ చెక్ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. నెటిజన్లు దీనిపై జోకులు, పదునైన వ్యాఖ్యలతో స్పందిస్తోన్నారు. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్‌లో లోపం.." అని ఓ యూజర్ సెటైర్ వేశాడు. "ఈ హిమాచల్ ప్రిన్సిపల్ దేశానికి, సమాజానికి భారం.." అని మరో నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. "రిజర్వేషన్ హటావో.. దేశ్ బచావో" అని ఏకంగా రిజర్వేషన్ల వ్యవస్థనే తప్పు పట్టాడు మరొకరు. స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇటువంటి తప్పులు రాస్తే అక్కడ చదివే పిల్లల పరిస్థితేమిటని ప్రశ్నిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+