విజయ్ ను గెలిపించిన ఒకే ఒక్క నినాదం, ఏపీలో ఆ గెలుపే అస్త్రంగా..!!
విజయ్ కొత్త చరిత్ర లిఖించారు. పార్టీ పెట్టిన రెండేళ్ల కాలంలోనే అధికారానికి దగ్గర అయ్యారు. తమిళనాడులో వస్తున్న ఎన్నికల ఫలితాలు విజయ్ కు పట్టాభిషేకం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. మెజార్టీకి కావాల్సిన నెంబర్ కు విజయ్ దగ్గరగా ఉన్నారు. పూర్తి మెజార్టీ రాకున్నా అన్నా డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. విజయ్ కు మద్దతుగా ఆ ఒక్క నినాదం అందరినీ ఏకం చేసింది. అయితే.. విజయ్ గెలుపుకు ఏపీలో నాటి ఫలితానికి దగ్గర పోలికలు ఉన్నాయి.
విజయ్ ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు సాధించారు. అధికారానికి చేరువ అయ్యారు. మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో ఉన్నారు. అయితే.. విజయ్ గెలుపు వెనుక ఏపీ రాజకీయాలతో సంబంధం కనిపిస్తోంది. 2019 లో జగన్ తరహాలోనే విజయ్ ఎన్నికల నినాదాలు ఎంపిక చేసుకున్నారు. జగన్ లాగానే సింగిల్ గానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2019 లో జగన్ నినాదమే ఇక్కడా విజయ్ ఫాలో అయ్యారు. 50 ఏళ్లుగా డీఎంకే - అన్నా డీఎంకే కు అవకాశం ఇస్తున్న ప్రజలు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్ధించారు. అదే మొత్తం లెక్కలు మార్చేసింది. ఇక.. 50 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీలతో సింగిల్ పోటి చేయాలనే హీరో డెసిషన్ ప్రజలను ఆకట్టుకుంది. అదే విధంగా ఎన్నికల హామీలు సైతం ప్రజలను దగ్గరకు చేసాయి. ఈ ఎన్నికల్లో విజయ్ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. అవి కూడా ఓటర్ల పైన ప్రభావితం చూపించాయి.

సింగిల్ గానే పోటీ.. అనూహ్య ఫలితాలు
విజయ్ తన మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌లను నిర్మూలన కు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అలాగే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల రుణాలను 50 శాతం మాఫీ చేస్తామన్నారు. అలాగే ఓ కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. దీంతో.. పూర్తిగా ఏపీలో నాటి విజయం కు దోహదం చేసిన అంశాలనే విజయ్ ఇక్కడా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. సింగిల్ గానే అధికారం దక్కించుకునే మార్గం సుగమం అయింది.













Click it and Unblock the Notifications