G20 Summit 2023: అతిధులకు స్పెషల్ మెనూ - స్ట్రీట్ ఫుడ్స్, మిల్లెట్స్ డిషెస్..!!

ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. జీ 20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబైంది. 20 దేశాల కూమటి నేతల సమావేశానికి సర్వం సిద్దమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ 20 సదస్సు జరగనుంది. విదేశీ అతిధుల కోసం భారతీయ సంప్రదాయ విందును అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ తో పాటుగా మిల్లెట్స్ తో చేసిన డిషెస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ ప్రాంతీయ వంటకాలను మెనూలో చేర్చారు.

జీ20 సమావేశానికి దేశ రాజధాని నగరం ఢిల్లీ ముస్తాబవుతోంది. సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు, అధికారులకు రుచికరమైన భారతీయ స్ట్రీట్ ఫుడ్, చిరుధాన్యాలతో తయారు చేసిన తినుబండారాలను అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో లభించే నోరూరించే స్ట్రీట్ ఫుడ్ కూడా మెనూలో చేర్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే చిరు ధాన్యాలతో చేసిన వంటకాలను దేశాధినేతలకు, వారితోపాటు వచ్చే అధికార బృందాలకు రుచి చూపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణానికి తగినట్లుగా, అత్యుత్తమ స్థాయి పోషక విలువలతో కూడిన డిషెస్..స్నాక్స్ సిద్ధం చేస్తున్నారు.

A taste of local flavors: G20 Summits exclusive menu features street food and millet creations

ఇదిలావుండగా, జీ20 సదస్సు పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా జీ20 తోటను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు తమ తమ దేశాలకు చెందిన ఓ మొక్కను ఈ తోటలో నాటబోతున్నారు. ఈ సదస్సు జరిగే భరత మండపం ప్రాంగణంలో ఈ తోటను పెంచుతారు.ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతల కుటుంబ సభ్యులు భారత్ సందర్శనను మధుర జ్ఞాపకంగా గుర్తుంచుకోవడానికి వీలుగా మన దేశంలోని సుప్రసిద్ధ హస్తకళలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు. అదేవిధంగా షాపింగ్ కోసం నేషనల్ గేలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌కు తీసుకెళ్తారు. ప్రపంచ నేతలు బస చేసే హోటళ్లు వినూత్నమైన, సృజనాత్మకమైన పద్ధతుల్లో రకరకాల చిరుధాన్యాల వంటకాలను తయారు చేయడంలో పోటీ పడుతున్నాయి.

ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలకు, ప్రతినిధి బృందాలకు ఇవ్వబోయే బహుమతులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా మన దేశంలోని హస్త కళలు, టెక్స్‌టైల్, చిత్రకళ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బహుమతుల్లో ఆత్మీయత కనబడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రులకు సూచించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన సందేశం ప్రతిబింబించే విధంగా బహుమతులను ఎంపిక చేస్తున్నారు. ప్రతీ అడుగలోనూ భారతీయత ప్రతిబింభించేలా ఏర్పాట్లు..మెనూ..బహుమతులు సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+