పరీక్షా కేంద్రంలో అమ్మాయి భుజం మీద నుంచి చేతులు వేసి కిందకు ?, టీచర్ చేసిన పనికి ?

చెన్నై/కన్యాకుమారి: 10వ తరగతి పరీక్షలు బాగారాసి మంచి మార్కులతో పాస్ అయ్యి ఫేమస్ కాలేజ్ లో చేరి ఉన్నత చదువులు చదవాలని అమ్మాయిలు, అబ్బాయిలు అనుకుంటారు. పరీక్షా కేంద్రంలో తన పాటికి తాను పరీక్ష రాస్తున్న అమ్మాయి భుజం మీద ఓ చెయ్యిపడింది. భుజం మీద నుంచి ఆ చేతులు ఆమె శీరరంలోని ప్రైవేట్ పార్ట్స్ తో పాటు ఎక్కడంటే అక్కడ పడటంతో పరీక్ష రాస్తున్న అమ్మాయి హడలిపోయింది.

తమిళనాడు వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమైనాయి. తమిళనాడులోని .కన్యాకుమారి జిల్లాలో 116 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలోని ప్రభుత్వ ఎయిడెడ్ హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

అరుమనై సమీపంలోని ప్రభుత్వ ఎయిడెడ్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న వేళవన్ అనే ఉపాధ్యాయుడిని ఆ పాఠశాలలో పరీక్షా గది ఇన్విజిలేటర్‌గా నియమించారు. 10వ తరగతి విద్యార్థి టీచర్ వేళవన్ ఉన్న గది పరీక్షా హాలులో పరీక్ష రాయడానికి వెళ్లింది. పరీక్ష రాస్తున్న విద్యార్థిని దగ్గరకు వెళ్లిన ఉపాధ్యాయుడు వేళవన్ వెనుక నుంచి వెళ్లి విద్యార్థిని భుజం మీద చేతులు వేశాడు.

 girlabusedbyinvigilator
అమ్మాయి శరీరాన్ని పదేపదే తాకిన టీచర్ వేళవన్ నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగూ అంటూ ఆమెను మాట్లాడుతూ లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో షాక్‌కు గురైన విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు టీచర్ వేళవన్ కు ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో ఆమెకు తోచలేదు. పరీక్ష రాసేసిన తరువాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఉపాధ్యాయుడు వేళవన్ అకృత్యాల గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత ఉపాధ్యాయుడు వేళవన్ మీద పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కుళితుర మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆ రోజు అమ్మాయితో పాటు పరీక్ష రాసిన కొందరు విద్యార్థులను విద్యాశాఖ అధికారులు, పోలీసులు రహస్యంగా విచారణ చేసి వివరాలు సేకరించారు..

10వ తరగతి అమ్మాయి ఫిర్యాదు మేరకు కులితుర మహిళా పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడైన టీచర్ వేళవన్‌ను అరెస్టు చేశారు. పరీక్షలు రాస్తున్న గదిలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసిన టీచర్ వేళవన్ చేసిన పనికి అమ్మాయి తల్లిదండ్రులను కలిచివేసింది. ఈ కేసులో అరెస్టయిన ఉపాధ్యాయుడు వేళవన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+