బెంగళూరుకు గుడ్ బై: అదొక్కటే సహనానికి పరీక్ష?
బెంగళూరుకు చెందిన ఒక టెక్కీ సిటీకి గుడ్ బై చెప్పాడు. గోల్డ్‌మన్ సాచ్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్ దోషి నగరాన్ని వీడుతూ రాసిన ఓ వీడ్కోలు లేఖ ఇది. దీన్ని లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
తాను బెంగళూరులో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా ఈ లేఖ రాశారు రోహిత్ దోషి. ఈ నగరం తనకు అద్భుతమైన స్నేహితులను, మధురమైన జ్ఞాపకాలను ఇచ్చిందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగం కోసం వేరే నగరానికి వెళ్లాల్సి రాడం వల్ల బెంగళూరును వీడుతున్నట్లు తెలిపారు.

బెంగళూరుకు తన హృదయంలో ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన అన్నారు. రాత్రిపూట రమేశ్వరం కేఫ్ లో ఫిల్టర్ కాఫీ తాగడం నుండి నంది హిల్స్‌కు ఉదయాన్నే వెళ్లడం వరకు ఎన్నో మధురమైన అనుభవాలు తన జీవితంలో నిలిచిపోయాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
కబ్బన్ పార్క్, లాల్ బాగ్, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్, విధాన సౌధ, రాస్తా కేఫ్, ఎయిర్‌లైన్స్ హోటల్, మల్లేశ్వరం, ఇందిరా నగర్ వంటి నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాలను తాను సందర్శించానని ఆయన తెలిపారు. ఇలాంటి అద్భుతమైన జ్ఞాపకాలను ఇచ్చిన బెంగళూరును వీడి వెళ్లక తప్పట్లేదని పేర్కొన్నారు.
బెంగళూరు ట్రాఫిక్ గురించి కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. మెట్రో రైలు సదుపాయం అన్ని ప్రాంతాలకు అందుబాటులో లేనందున ప్రైవేట్ రవాణా, అధిక ధరలు, క్యాబ్ కోసం ఎదురుచూపులు తప్పలేదని అన్నారు. క్యాబ్ లోనో, ఆటో లోనో ఎక్కడికైనా వెళ్లడానికి డ్రైవర్ అంగీకరించడమే గొప్పవిషయమని వ్యాఖ్యానించారు.
బెంగళూరులో ట్రాఫిక్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇక్కడి వాతావరణంలో కొంత సమస్యాత్మంగా ఉన్నాయని రోహిత్ దోషి చెప్పారు. ఇక్కడి ట్రాఫిక్.. వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తుందని చెప్పారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అధికంగా ఉండటం వల్ల కొంత ఆర్థిక భారమేనని పేర్కొన్నారు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు.
బెంగళూరు తన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిందని దోషి అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలో, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకున్నానని ఆయన అన్నారు. ఊహించని వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడం కూడా ఒక అనుభవమని ఆయన అన్నారు.
బెంగళూరుకు కృతజ్ఞతలు తెలుపారు. ఈ సిటీ ఎప్పుడూ ఓ విలువైనదేనని రోహిత్ దోషి అన్నారు. తాను ఇష్టపడే ప్రదేశాల ఫొటోలను కూడా పంచుకున్నారాయన. ఈ పోస్ట్ కు నెటిజన్లు స్పందించారు. బెంగళూరు ఒక చిరస్మరణీయ అనుభూతి ఇస్తుందని, ఇక్కడి స్నేహపూరక వాతావరణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని కామెంట్ చేశారు.
మరో యూజర్ స్పందిస్తూ బెంగళూరు ఓ సిటీ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్ అని వ్యాఖ్యానించారు. బెంగళూరు ట్రాఫిక్ మాత్రమే సహనాన్ని పరీక్షిస్తుందని, ఇక్కడ లభించే జీవనశైలి, స్నేహాలు మరెక్కడా దొరకవని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications