బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

techie: భార్యకు చెప్పింది వేరు, కారులో నైట్రోజన్ సిలిండర్ తో ? గూగుల్ లో వెతికిన టెక్కీ చివరికి ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి ఐటీ హబ్ లోనే నివాసం ఉంటున్నాడు. కారు సర్వీసుకు వదిలి వస్తానని భార్యకు చెప్పిన టెక్కీ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రింగ్ రోడ్డు జంక్షన్ సమీపంలో ఆ టెక్కీ కారులో నైట్రోజన్ సిలిండర్ ఓపెన్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని ఆ టెక్కీ కొన్ని రోజులుగా గూగుల్ లో వెతికాడని వెలుగు చూసింది.

Lady teacher: ఇంట్లో మొగుడు, స్కూల్ లో ప్రియులు, పాత ప్రియుడి చేతిలో కొడుకు !Lady teacher: ఇంట్లో మొగుడు, స్కూల్ లో ప్రియులు, పాత ప్రియుడి చేతిలో కొడుకు !

టెక్కీకి భార్య, పిల్లలు

టెక్కీకి భార్య, పిల్లలు

బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లేఔట్ లో విజయ్ కుమార్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బెంగళూరు సిటీలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో విజయ్ కుమార్ చాలా సంవత్సరాల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. మహాలక్ష్మి లేఔట్ లోని సొంత ఇంటిలో భార్య, పిల్లలతో కలిసి విజయ్ కుమార్ నివాసం ఉంటున్నాడు.

భార్యతో చివరిసారి మాట్లాడాడు

భార్యతో చివరిసారి మాట్లాడాడు

తాను కారు సర్వీస్ కు వదిలి వస్తానని భార్యకు చెప్పిన విజయ్ కుమార్ కారులో బయటు వెళ్లాడు. కురుబరహళ్లి జంక్షన్ సమీపంలోని రింగ్ రోడ్డు దగ్గరకు వెళ్లిన విజయ్ కుమార్ అక్కడ రోడ్డు పక్కన కారు నిలిపాడు. తనకు అనారోగ్యంగా ఉందని, ఇక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటానని, కారుకు పైన కవర్ వెయ్యాలని స్థానికులకు మనవి చేశాడు.

కారు వెనుక సీటులో కుర్చుని ?

కారు వెనుక సీటులో కుర్చుని ?

విజయ్ కుమార్ కుమారులో కుర్చున్న తరువాత స్థానికులు ఇద్దరు అతని కారు మీద కవర్ కప్పారు. వెనుక సీటులో కుర్చున్న విజయ్ కుమార్ నైట్రోజన్ సిలిండర్ ఆన్ చేసి దాని పైపు ముక్కులో కట్టుకుని ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకున్నాడు. చాలాసేపటికి స్థానికులకు అనుమానం వచ్చి విజయ్ కుమార్ కారు మీద కవర్ తియ్యడంతో అతను చలనం లేకుండా పడి ఉన్న విషయం వెలుగు చూసింది.

డెత్ నోట్ రాసిన టెక్కీ

డెత్ నోట్ రాసిన టెక్కీ

వెంటనే విజయ్ కుమార్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్ కుమార్ చనిపోయాడని పోలీసులు అన్నారు. చాలా కాలంగా విజయ్ కుమార్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడని, ఇదే జనవరి నెలలో ఆపరేషన్ కూడా జరిగిందని పోలీసులు అన్నారు. నేను అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని టెక్కీ విజయ్ కుమార్ డెత్ నోట్ రాసి పెట్టాడని పోలీసులు అన్నారు.

గూగుల్ లో వెతికి ఆత్మహత్య చేసుకున్నాడు

గూగుల్ లో వెతికి ఆత్మహత్య చేసుకున్నాడు

చాలా రోజుల నుంచి ఆత్మహత్య ఎలా చేససుకోవాలి అని విజయ్ కుమార్ గూగుల్ వెతికాడని, తరువాత నైట్రోజన్ సిలిండర్ కొనుక్కున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది .ఇటీవల కాలంలో చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలని గూగుల్ లో వెతుతున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A techie who searched Google and committed suicide by taking a nitrogen cylinder in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X