దొంగతనం చేశాడు; ఆపై సీసీకెమెరా ముందు ఆనందంగా డ్యాన్స్ చేశాడు.. వైరల్ వీడియో
దొంగతనం ఒక కళ. దొంగతనం చేయడంతో పాటుగా చోర కళా ప్రావీణ్యుడు అదనపు కళలను ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? చూడడానికి ఆశ్చర్యంగా అనిపించినా దొంగ చేసిన పని అందరినీ నవ్వుకునేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చేసిన ఓ చోరీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షాకింగ్ చోరీ.. చోరీ తర్వాత దొంగ చేసిన పని చూస్తే అవాక్కవటం ఖాయం
సహజంగా ఎవరైనా దొంగతనానికి వెళితే ఎవరు చూడకుండా, చిన్న శబ్దం కూడా కాకుండా దొంగతనం చేసుకుని వెళతారు. గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ దొంగ సీసీ కెమెరాని చూసి డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో దొంగతనానికి వెళ్లిన దొంగ అక్కడ చోరీ చేసిన తర్వాత డాన్స్ చేస్తూ కనిపించాడు. అన్షు సింగ్ అనే వ్యక్తికి చందౌలి మార్కెట్లో హార్డ్ వేర్ దుకాణం ఉంది. ఏప్రిల్ 16వ తేదీన తెల్లవారుజామున ఈ హార్డ్ వేర్ దుకాణాన్ని దోచుకోవాలన్న ఉద్దేశంతో లోపలికి వచ్చిన దొంగ ముందుగా క్యాష్ కౌంటర్ లో ఉన్న వస్తువులను తీసుకున్నాడు.
సీసీ కెమెరాను చూసి డ్యాన్స్ చేసిన దొంగ
ఆ తర్వాత అటు ఇటు తిరిగాడు. అక్కడ దుకాణంలో ఆమె చిన్న సిసి కెమెరా ని చూసి డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. సహజంగా ఎవరైనా సిసి కెమెరా ని చూస్తే ముఖం కనిపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ దొంగ మాత్రం సీసీ కెమెరా ఎదురుగా నిలబడి ఆనందంతో డాన్స్ వేసాడు. చోరీ జరిగిన మరుసటి రోజు తెల్లవారుజామున షాప్ షట్టర్ పగలగొట్టి ఉండడాన్ని గమనించిన యజమాని సీసీ టీవీ పుటేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగతనానికి వచ్చిన దొంగ వీడియోని చూసి షాపు యజమాని అవాక్కయ్యాడు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దొంగ డ్యాన్స్ వీడియో
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఒక ట్విటర్ యూజర్ షేర్ చేసిన 32 సెకన్ల క్లిప్‌లో దొంగ, తలపై గుడ్డ కప్పుకుని, షాప్ షట్టర్ దగ్గర డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. కొద్దిసేపు డాన్స్ చేసిన తర్వాత, అతను షట్టర్ మరియు ఫ్లోర్ మధ్య ఉన్న చిన్న గ్యాప్ ద్వారా పాకడం మరియు తప్పించుకోవడం కనిపిస్తుంది.

దొంగ కోసం గాలిస్తున్న పోలీసులు
ఈ సంఘటన ఏప్రిల్ 16న జరిగింది. ట్విట్టర్ వినియోగదారు తన ట్వీట్‌లో చందౌలీ పోలీసులను మరియు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) జోన్ లక్నోను ట్యాగ్ చేసి, యుపిలో దొంగతనం జరిగిన తర్వాత దొంగ సంబరాలు చేసుకుంటున్నాడు. చందౌలీ పోలీసులకు ఏమైనా బాధ్యత ఉందా? అని మండిపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చందౌలీ పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన దొంగ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా, అలాగే భౌతిక ఆధారాలను బేస్ చేసుకుని దొంగను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications