వందే భారత్‌కు బూస్ట్: రైల్వే బడ్జెట్ కేటాయింపులు ఇవీ..

Railway Budget 2025: వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకొచ్చింది. లోక్‌సభలో శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో రైల్వే బడ్జెట్‌నూ ఆమె సభ సమక్షానికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా చదివి వినిపించారంతే.

తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెరపైకి వచ్చారు. రైల్వే బడ్జెట్ వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆన తన అధికారిక ఎక్స్ ప్లాట్‌‌ఫామ్‌పై పోస్ట్ చేశారు. రైల్వేలకు కేటాయించిన బడ్జెట్, విభాగాల వారీగా కేటాయించిన నిధులు, 2025-26 ఆర్థిక
సంవత్సరంలో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి తెలియజేశారు.

A total Capex of Rs 26 200 Cr has been allocated to Railways

1. రైల్వే బడ్జెట్ 2,65,200 కోట్ల రూపాయలు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద కేటాయించిన నిధులు ఇవి. ఇందులో రోడ్ ఓవర్ బ్రిడ్జీ/రోడ్ అండర్ బ్రిడ్జీల నిర్మాణానికి 7,000 కోట్ల రూపాయలను కేటాయించారు. వీటి కోసం 2009- 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సగటు కేటాయింపు 916 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు 7 వేల కోట్లకు చేరింది.

2. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి 32,235 కోట్ల రూపాయలు కేటాయింపు. 2009- 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సగటు కేటాయింపు 5,075 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు 32,235 కోట్లకు చేరింది.

3. లోకో మోటివ్ ఇంజిన్లు, కోచ్ వంటి రోలింగ్ స్టాక్స్ కోసం 57,693 కోట్ల రూపాయలు. 2009- 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సగటు కేటాయింపు 16,029 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు 57,693 కోట్లకు చేరింది.

4. గేజ్ కన్వర్షన్ కోసం 4,550 కోట్ల రూపాయలు కేటాయింపు. 2009- 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సగటు కేటాయింపు 3,088 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడీ మొత్తం 4,550 కోట్లకు చేరింది.

5. డబ్లింగ్ కోసం 32,000 కోట్ల రూపాయలు కేటాయింపు. 2009- 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సగటు కేటాయింపు 2,461 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడీ మొత్తం 32,000 కోట్లకు చేరింది.

ఈ కేటాయింపుల్లో ఊహించినట్టే రోలింగ్ స్టాక్స్‌కు అత్యధికంగా నిధులను కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మరింత ఊతమిచ్చినట్టయింది. 2028 నాటికి దాదాపుగా అన్ని ప్రధాన నగరాలు, ఎగువ మధ్యస్థాయి పట్టణాలను అనుసంధిస్తూ కొత్త మార్గాల్లోనూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+