Viral Video: నడుస్తోన్న బైక్‍పై హగ్గులు.. వైరల్ అయిన వీడియో..
కొంత మంది కావాలనే కొన్ని పనులు చేసి వైరల్ అవ్వాలనుకుంటారు. తాజాగా ఓ జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.లవర్స్ కదులుతున్న బైక్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని ఇందిరాపురం ప్రాంతానికి సమీపంలోని NH9పై ఓ జంట బైక్ పై రోమాన్స్ చేస్తూ కనిపించారు. అమ్మాయి బైక్ ట్యాంకర్ పై అబ్బాయి అప్పొసిట్ గా కూర్చుంది.
అబ్బాయిని గట్టిగా వాటేసుకుని ఉంది. వీరిని వెనకాల కారులో వెళ్తున్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. కావాలనే వారు అలా చేశారని కొందరు కామెంట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన యూపీ పోలీస్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఘజియాబాద్ పోలీసులను ఆదేశించారు.

అయితే ఇలాంటి సంఘటనలు ఇటీవల చాలానే జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని B2 బైపాస్ సమీపంలో ఒక జంట కదులుతున్న బైక్‌పై శృంగార విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో దొంగిలించిన బైక్‌పై ఒక వ్యక్తి తన ప్రియురాలికి రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. వీడియో వైరల్ కావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
#गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है ।
— Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023
वो कहते है ना -
"हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे "
पर
नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO
జనవరిలో శాఖపట్నం వద్ద గాజువాక సమీపంలో స్టీల్ ప్లాంట్ రోడ్డు పై పట్టపగలే రొమాన్స్ చేసుకుంటూ వెళ్లింది. ప్రియురాలిని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోబెట్టుకుని ప్రియుడు వాహనం నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను కారులో కూర్చున్న ఓ వ్యక్తి రికార్డు చేశారు. బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు కూడా.. దీనిపై పోలీసులు స్పందించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications