Viral Video: చెట్టు ఎక్కిన చిరుత పులి.. తర్వాత ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. తాజాగా చిరుత పులికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో చిరుత పులి కొబ్బరి చెట్టు ఎక్కింది. కోతిలాగా చాలా సింపుల్ చిరుత చెట్టు ఎక్కింది. చెట్టు ఎక్కిన చిరుత చుట్టు పరిసరాల్లో ఏమైనా జంతువులు ఉన్నాయో పరిశీలించింది.

లక్ష 43 వేల వ్యూస్
అనంతరం కిందికి దిగింది. మొక్క జొన్న చేలో ఉన్న కొబ్బరి చెట్టును చిరుత ఎక్కింది. చిరుత కొబ్బరి చెట్టు ఎక్కడాన్ని అక్కడే ఉన్న కొందరు రైతులు వీడియో తీశారు. ఈ వీడియోను సుశాంత్ నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఆదివారం పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు లక్ష 43 వేల వ్యూస్ వచ్చాయి. 3 వేలకు పైగా లైక్స్ రాగా.. 600లకు పైగా మంది రీట్వీట్ చేశారు.

A video of a leopard climbing a coconut tree is going viral on social media

చివరి వరకు చూడండి
సుశాంత్ నందా వీడియోతో పాటు చిరుతపులి కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కిందో అని ఆలోచిస్తే చివరి వరకు చూడండి అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. వామ్మో.. చిరుత పులి చెట్టు ఎక్కుతుందా అని కామెంట్ చేశారు. ఈ చిరుతతో జాగ్రత్తగా ఉండాలని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+