Viral Video: మేనకోడలి పెళ్లికి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన మామ.. క్షణాల్లో మృతి..

ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి గుండె పోటు వస్తుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్త బ్యాట్మెంటన్ ఆడుతూ కుప్పకూలి చనిపోయాడు. అంతకు ముందు ఓ వ్యక్తి పెళ్లి హల్ది ఫంక్షన్ లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వ్యక్తి తన మేనకోడలు పెళ్లి సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇతరలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. కాసేపు డ్యాన్ చేసిన తర్వాత కూర్చున్నాడు, కూర్చున్న కాసేపటికే కింద పడిపోయాడు.

A video of a man dying of a heart attack while dancing at a wedding is going viral on social media

వెంటనే అక్కడున్నవారు అతన వద్దకు వచ్చినట్లు వీడియోల కనిపిస్తోంది. ఆతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.మృతుడు రాష్ట్రంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న బలోద్ జిల్లాకు చెందిన దిలీప్ రౌజ్‌కర్‌గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో ఓ పెళ్లికి వెళ్లాడు. మే 4, 5 మధ్య రాత్రి రౌజ్కర్ తన మేనకోడలు పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

డ్యాన్స్ చేస్తుండగా, హఠాత్తుగా విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుని, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మొత్తం పెళ్లి వీడియోలో రికార్డు అయింది. జనవరిలో, మధ్యప్రదేశ్‌లోని రేవాలో వివాహ ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ 32 ఏళ్ల వ్యక్తి మరణించాడు. గత సంవత్సరం సియోని ప్రాంతంలో 60 ఏళ్ల మహిళ గుండెపోటు కారణంగా వివాహ సంగీత డ్యాన్స్ ఫ్లోర్‌పై అకస్మాత్తుగా పడి మరణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+