మాల్ లో లేడీస్ ని ఏం చేశాడంటే ?, సోషల్ మీడియాలో వీడియో వైరల్ !

బెంగళూరు: బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే లులు మాల్ లో ఓ వ్యక్తి మహిళను లైంగికంగా, శారీరకంగా వేధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో వైరల్‌గా మారింది. పాత మైసూర్ రోడ్‌లోని గోపాల్‌పురం ప్రాంతంలోని లులు మాల్ ఫాంటురాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సందర్భంగా మాల్‌లో ఉన్న యశ్వంత్ తొగటవీర అలియాస్ యశ్వంత్ అనే వ్యక్తి అతని ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

వైరల్ అయిన వీడియోలో మాల్‌లోని గేమింగ్ జోన్‌లో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక మహిళ వెనుక భాగాన్ని తాకడం కనిపించింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి లులు మాల్ ఫాంటురాలో జరిగింది. వీడియోలోని ఈ వ్యక్తి అక్కడ కొందరు మహిళలు, అమ్మాయిలతో ఈ రకంగా వారిని శారీరకంగా ఇబ్బంది పెట్టాడని సోషల్ మీడియాలో యశ్వంత్ పోస్టు చేశాడు.

A video of a man misbehaving with women in a mall in Bengaluru has gone viral on social media

చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో మహిళలు, యువతుల వెంట వెలుతున్న అతన్ని చూసినప్పుడు మొదట నాకు అనుమానం వచ్చింది. అప్పుడు నేను వీడియో రికార్డ్ చేసాను. అతనిని నేను అనుసరించాను అని వీడియోను షేర్ చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో వివరించాడు. ఈఘటనపై యశ్వంత్ మాల్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. అయితే సెక్యూరిటీ గార్డులు వచ్చే సమయానికి ఆ వ్యక్తి పరారయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగుళూరు పోలీసులు సోషల్ మీడియాలోని పోస్ట్‌పై స్పందించారు. , వీడియోలో ఉన్న వ్యక్తి మీద ఫిర్యాదు చేయడానికి వీడియోను షేర్ చేసిన తనను సంప్రదించాలని సంతోష్ పోలీసులకు మనవి చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో బెంగళూరులోని మాగాడి రోడ్డు పోలీసులు సుమోటో ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+