Viral Video: గుంజీలు తీయిస్తే గుంజి గుంజి కొట్టిండ్రు..! వైరల్ అయిన వీడియో..
ఓ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థికి పనిష్మెంట్ ఇవ్వడంతో అతన్ని విద్యార్థి తల్లిదండ్రులు చితబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాధ్యాయుల కార్యాలయంలోకి చొరబడిన ఓ వ్యక్తి ఓ ఉపాధ్యాయుడిని కొట్టాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉపాధ్యాయుడు విద్యార్థితో బలవంతంగా గుంజీలు తీయించారు. దీంతో విద్యార్థి ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతని కోపంతో పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు.
ఐదో తరగతి చదువుతున్న విద్యార్థితో ఉపాధ్యాయుడు 50 కి పైగా గుంజీలు తీయించాడు. దీంతో బాలుడి కాళ్లు వాపు వచ్చాయని విద్యార్థి తండ్రి ఆరోపించాడు. దీంతో కోపంతో ప్రిన్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఉపాధ్యాయుడిని కొట్టారు. ఆ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలో దాడి ఘటన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో ఆఫీస్ లో ఓ వ్యక్తి ప్రవేశించి.. ఉపాధ్యాయుడిపై విరుచుకపడ్డాడు. ఈ వీడియోలో బాధిత బాలుడితో పాటు ప్రిన్సిపల్ ను కూడా ఉన్నాడు.

कानपुर: बसंत विहार स्थित साउथ सिटी पब्लिक स्कूल में बच्चे से उठक बैठक करवाने पर शिक्षक से नाराज परिजनों ने ऑफिस में घुस की मारपीट.!!
— Jr.Gaurav Kushwaha 🇮🇳 (@Gauravlivee) September 18, 2023
घटना का सीसीटीवी वीडियो आया सामने,हनुमंत विहार थाना अंतर्गत का मामला.!!#Kanpur #Crime #Schoolfight #gknews #basantvihar pic.twitter.com/1OHqxO2DwD












Click it and Unblock the Notifications