Viral Video: అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
ఈ మధ్య ప్రజాప్రతినిధులు హద్దులు మీరుతున్నారు. ప్రభుత్వ అధికారులపై చర్యలు చేయిచేసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన ఓ మహిళా శాసనసభ్యులు సివిల్ ఇంజనీర్‌ను కొట్టింది. ఇందుకు సంబంధంచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరా భయందర్ లోని కొన్ని నిర్మాణాలను కూల్చివేయడంపై మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఇద్దరు ఇంజనీర్లను మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ దుర్భాషలాడినట్లు వీడియో చూపిస్తుంది.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023
కూల్చివేతల కారణంగా వర్షాకాలం ముందు పిల్లలతో సహా ఆక్రమణదారులు రోడ్లపైనే ఉండాల్సి వచ్చిందన్నారు.ఇంజనీర్లు నిర్మాణాలను ఎలా ధ్వంసం చేస్తారని జైన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ ఇంజినీర్ ను చెంప దెబ్బ కొట్టారు. MBMC కమీషనర్ దిలీప్ ధోలే ప్రతిస్పందనను కోరుతూ ఒక సందేశం పంపినట్లు.. కానీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే ఇంజినీర్ కొడుతునప్పుడు అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బీజేపీ మాజీ మేయర్ అయిన జైన్ 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆమె బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతిస్తోంది. ప్రజాప్రతినిధులు అధికారులను దర్బాషలాడడం గతంలో చాలా జరిగాయి. కొద్ది రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి గల్లా పట్టుకున్నాడు.
అందరూ చూస్తుండగానే బాధ్యతాయుత ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తీరును చూసి అక్కడున్న మిగతా అధికారులు, సిబ్బంది భయపడిపోయారు.

ఈ ఘటన జోగులంబ గద్వాల జిల్లాలో జరిగింది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ సరితాను ప్రిన్సిపాల్ ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే పాఠశాలను జడ్పీ ఛైర్‌పర్సన్ ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యో కోపంతో ప్రిన్సిపల్ గల్లా పట్టుకున్నాడు. దుర్బాషలాడాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications