Viral Video: పానీ పూరి పానీలో టాయిలెట్ క్లీనర్..! షాకింగ్ వీడియో..
మీరు పానీ పూరి తుంటున్నారా అయితే.. మీరు ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన వారు జీవితంలో పానీ పూరి జోలికి వెళ్లరు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మామూలుగా హచ్ చల్ కావడం లేదు. ఓ వ్యక్తి "పానీ పూరీ" నీళ్లతో నిండిన కంటైనర్‌లో టాయిలెట్ క్లీనర్ అయిన అర్పిక్ ను కలుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

టాయిలెట్ క్లీనర్
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. వీడియోతో పాటు "ఫ్రెండ్స్, టాయిలెట్ క్లీనర్ ఎలా మిక్స్ చేస్తున్నారో చూడండి. పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. గోల్గప్పా నీటి రుచిని పెంచడానికి, దానికి టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారని. ఈ వీడియో అవగాహన కల్పించడానికి పోస్ట్ చేశామని" రాశారు.

ఇంట్లోనే చేసుకుంటే మంచిది..
ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. పానీ పూరిని ఎక్కువగా ఇష్టపడి తినే మహిళలు ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందని ఒకరు, ఇంత ఘోరంగా ఉంటుందా అని మరొకరు కామెంట్ చేశారు.ఇలాంటి పను చేసేవారిని జైలుకు పంపాలని కొందరు డిమాండ్ చేశారు. ఏదిఏమైనా.. మీరు పానీ పూరి తినేటప్పుడు జాగ్రత్త.. శుభ్రంగా, మంచి పదార్థాలు వాడి చేసిన పానీ పూరినే తినండి. మీకు ఓపిక ఉంటే ఇంట్లో చేసుకుని తినండి.
నిజమేనా..
అయితే ఈ వీడియోపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిజమే లేక ఫేకా తెలియరాలేదు. ఈ వీడియో ఎవరు పోస్ట్ చేశారు. ఈ వీడియో ఎక్కడ రికార్డ్ చేశారు అనే విషయంపై కూడా స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications