Viral Video: మీద పడి మరి కొట్టేసుకున్న మహిళ టీచర్లు.. వీడియో వైరల్..!
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే బరితెగించారు. విచక్షణ మరిచి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. స్కూల్ లేట్ గా వచ్చినందుకు పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయురాలిపై దాడికి దిగింది. ఉపాధ్యాయురాలు కూడా తిరిగి దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఆగ్రాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మే 3న ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. అయితే వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిగానా గ్రామంలో ప్రీ సెకండరీ పాఠశాల ఉంది. ఇందులో గుంజన్ చౌదరి ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇదే పాఠశాలలో మరో మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. శుక్రవారం గుంజన్ చౌదరి స్కూల్ కు లేట్ గా వచ్చింది.

హెడ్ మాస్టర్ ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ గుంజన్ చౌదరిపై దాడి చేసింది. ఈ క్రమంలో స్వల్ప పెనుగాలట జరిగింది. వారి దుస్తువులు కూడా చెరిగాయి. అయితే అక్కడే ఓ ఉపాధ్యాయుడు వారిని కొట్టుకోకుండా అడ్డుకున్నాడు. ఈ క్రమంలో హెడ్ మాస్టర్, టీచర్ బూతులు తిట్టుకున్నారు. ఎట్టకేలకు వారిని వీడదీశారు. ప్రిన్సిపల్ బయటకు పంపే ప్రయత్నం చేయగా.. గుంజన్ చౌదరి దాడి చేసే ప్రయత్నం చేసింది.
అయితే మిగతా వారు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. విద్యార్థుల ముందే వారు ఘర్షణకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ఓ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనపై ఇద్దురు ఉపాధ్యారాయురాళ్లు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024












Click it and Unblock the Notifications