Viral Video: హృదయాన్ని కదిలిస్తున్న వీడియో.. అమ్మ ప్రేమకు ఇదే నిదర్శనం..
సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైన ఉందంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే.. ఎందుకంటే ఆ ప్రేమలో ఎలాంటి స్వర్థం ఉండదు. ప్రతి ఒక్క తల్లి తన పిల్లలే జీవితంగా బతుకుతుంది. తాను తిన్నా తినుకున్నా పిల్లలకు మాత్రం పెడుతుంది. ఈ తల్లి ప్రేమ మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ కూడా ఉంటుంది. ఈ అమ్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ కొండముచ్చు తన బిడ్డను హత్తుకుని కనిపిస్తుంది. అక్కడికి వచ్చిన ఓ బాలిక పిల్ల కొండముచ్చును బలవంతంగా తీసుకుంటుంది. కానీ తన బిడ్డను ఎక్కడ దూరం చేస్తారో అని అ తల్లి కొండముచ్చు వెంటనే ఆ బాలిక వద్దకు వెళ్లి తన బిడ్డను తీసుకుంటుంది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వారు ఒకరు మొబైల్ లో బంధించారు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. తరెక్ ఫతహ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు ఇది ఇండియాలో మాత్రమే.. అని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయం కదిలింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఈ దృశ్యం కళ్లకు కట్టింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్వీట్ ను చాలా మంది రీట్వీట్ కూడా చేశారు.
ఈ
వీడియో
చూసిన
నెటిజన్లు
కొండముచ్చు
ప్రేమకు
ఫిదా
అయిపోయారు.
అమ్మ
ప్రేమకు
అవధులు
ఉండవని
ఒక
నెటిజన్
కామెంట్
చేశారు.
ఈ
వీడియో
నా
హృదయాన్ని
కదిలించిందని
మరొక
నెటిజన్
కామెంట్
చేశారు.
Only in my India🇮🇳🐒
— Tarek Fatah (@TarekFatah) January 18, 2023
pic.twitter.com/nug3ub0bsZ