Viral Video: గాల్లో రూ.500 కరెన్సీ నోట్లు వైరల్ అయిన వీడియో..
గాల్లోకి రూ.500 కరెన్సీ నోట్లను వెదజల్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీ ముందు గాల్లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగిరితే ఏం చేస్తారు. వెంటనే వాటి పట్టుకుంటారు. అయితే గాల్లో డబ్బులు ఎవరు ఎగరేస్తారని మీకు సందేహం రావొచ్చు. అయితే గాల్లో పైసలు ఎగరేసే వారు కూడా ఉన్నారు. తాజాగా గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తన ఇంటి పై నుంచి కాసుల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్‌లోని కేక్రీ తహసీల్‌లోని అగోల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఇంటి కింద గుమికూడిన జనం 500 రూపాయల కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. తన మేనల్లుడి పెళ్లి వేడుకలో భాగంగా డబ్బుల వర్షం కురిపించారు. మాజీ సర్పంచ్ కరీం యాదవ్ మేనల్లుడు రజాక్ గ్రామంలో పెళ్లి ఊరేగింపులో ఉండగా, మాజీ సర్పంచ్, అతని కుటుంబ సభ్యులు ఇంటి పైకప్పుపైకి వెళ్లి వేడుకలను చూసేందుకు గుమిగూడిన ప్రజలపై డబ్బు వర్షం కురిపించారు.
#SorosGang भिखारी ए भारत हे तेरे वाहा filmo मे रुपीया उडते हे 🤣🤣🤣
— akshaypatel (@akshayhspatel) February 18, 2023
गुजरात मेहसाणा pic.twitter.com/T7lKnK8AnA

వైరల్ వీడియోలో, జోధా అక్బర్‌లోని బాలీవుడ్ పాట "అజీమ్-ఓ-షాన్ షెహెన్‌షా" బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, ఇంటి క్రింద నిలబడి ఉన్న వ్యక్తులు తమపై పడుతున్న నోట్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం అని, అందుకే ఇలా చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications