వేడి నీళ్లలో కారం పొడి కలిపి భర్తను చంపేసిన భార్య, అత్త హ్యాండ్ కూడా ఉందని !
చెన్నై/ తిరుచ్చి: తమిళనాడులోని సేలం జిల్లాలోని తిరువెరుంపూర్‌లోని భారతీపురంలో సెల్వరాజ్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం డయానా మేరీ (22) అనే యువతిని సెల్వరాజ్ పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు పిల్లలు లేరు. ఆటోడ్రైవర్ అయిన సెల్వరాజ్ తరచూ మద్యం తాగి ఇంటికి వెళ్లి అతని భార్యతో గొడవ పడేవాడు. ఎవరు ఎన్ని చెప్పినా సెల్వరాజ్ మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది.
3 నెలల క్రితం మేరీ ఆమె భర్తపై గొడవపడి అదే ప్రాంతంలో ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత మేరీ ఆమె భర్త ఇంటికి వెళ్లలేదు. బంధువులు రాజీ చేసినా డయానా మేరీ భర్తతో కాపురం చెయ్యడానికి అంగీకరించలేదు. మే 5వ తేదీన సెల్వరాజ్ తన భార్యను వెతుక్కుంటూ అత్తగారింటికి వెళ్లాడు. తనతో వచ్చి కాపురం చెయ్యాలని సెల్వరాజ్ అతని భార్య మేరీకి చెప్పాడు. అయితే మేరీ కాపురం చెయ్యడానికి అంగీకరించలేదు.

దీంతో మళ్లీ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన సెల్వరాజ్ తన భార్య డయానా మేరీని కొట్టాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన డయానా మేరీ అప్పటికే స్టౌ మీద సలసలా కాగుతున్న వేడినీళ్లలో కారంపొడి కలిపి ఆమె భర్త సెల్వరాజ్ మీద పోసింది. శరీరం కాలిపోవడంతో సెల్వరాజ్ నొప్పితో కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు సెల్వరాజ్ ను రక్షించి దువక్కుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం తదుపరి చికిత్స నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న సెల్వరాజ్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. తన భార్య మేరీ తనపై వేడినీళ్లు పోసిందని సెల్వరాజ్ పోలీసులకు చెప్పాడు. తిరువెరుంపూర్ పోలీసులు సెల్వరాజ్ భార్య డయానా మేరీ, అత్తగారు ఇన్నాసియమ్మాళ్ (43)లను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన సెల్వరాజ్ అతని అత్తగారితో దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడని స్థానికులు పోలీసులకు చెప్పారు. మేరీ వేడినీటిలో కారం పొడి పోసి ఆమె భర్త సెల్వరాజ్ ను హత్య చెయ్యడం తిరువెరంపూర్‌లో కలకలం రేపింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications