భర్తను బంపర్ ఆఫర్ లో అమ్మేసిన భార్య, దసరా ఆఫర్ లో కొనుక్కున్న గర్ల్ ఫ్రెండ్, ఎంతంటే !
బెంగళూరు/మండ్య: కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఊర్లోవాళ్ల సమక్షంలో వివాహం (marriage) చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగానే కాపురం చేశాడు. చాలా సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన భర్త (husband) ఆమె అంటే మోజు తీరిపోయింది. ఇదే సమయంలో వివాహిత మహిళతో భర్త అక్రమ సంబందం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు. విషయం తెలుసుకున్న భార్య నువ్వు నీ ప్రియురాలితోనే ఎంజాయ్ చేసుకో అంటూ దసరా బంపర్ ఆఫర్ టైప్ లో భార్య ఆమె భర్తను అతని ప్రియురాలికే రూ 5 లక్షలకు అమ్మేయడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని మండ్య నగరం సమీపంలోని ఓ గ్రామంలో జగన్నాథ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన అమల (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని పెళ్లి (marriage) చేసుకోవడానికి జగన్నాథ్ ఓకే చెప్పాడు. అందరి సమక్షంలో జగన్నాథ్, అమలల పెళ్లి (marriage) జరిగింది.

చాలా సంవత్సరాలు జగన్నాథ్, అమల దంపతులు కాపురం చేశారు. అయితే కట్టుకున్న భార్య (wife) అమల మీద మోజు తీరిపోయింది అనుకున్న జగన్నాథ్ వివాహిత మహిళ రజనీ (పేరు మార్చడం జరిగింది) అనే వివాహిత మహిళతో జగన్నాథ్ అక్రమ సంబంధం (illegal affair) పెట్టుకున్నాడు. భార్య (wife)రజనీకి మాయమాటలు చెప్పి బయటకు వెలుతున్న జగన్నాథ్ అతని ప్రియురాలు రజనీతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.
విషయం తెలుసుకున్న అమల ఆమె భర్త (husband)జగన్నాథ్ కు బుద్దిచెప్పాలని అనుకుంది. తన భార్య (wife) అమలకు తన అక్రమ సంబంధం మ్యాటర్ తెలిసిపోయిందని అనుకున్న జగన్నాథ్ అతను జాగ్రత్తపడ్డాడు. అయితే ఇటీవల భర్త (husband) జగన్నాథ్, అతని ప్రియురాలు రజనీ ఏకాంతంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇద్దరిని అమల రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పెద్ద గొడవ చేసింది.

జగన్నాథ్, అతని ప్రియురాలు రజనీల గొడవ పంచాయితీ పెద్దల ముందుకు వెళ్లింది. ఎవరు ఎన్ని చెప్పినా జగన్నాథ్ ను వదిలిపెట్టడానికి అతని ప్రియురాలు రజనీ అంగీకరించలేదు. నీ భర్త (husband) జగన్నాథ్ తన దగ్గర రూ. 5 లక్షలు అప్పు చేశాడని, నువ్వు ఆ ఐదు లక్షల రూపాయలు తనకు ఇచ్చి నీ మొగుడిని నువ్వు పిలుచుకుని వెళ్లాలని ప్రియురాలు రజనీ పంచాయితీలో ప్రియుడి భార్య (wife)అమలకు షరతులు పెట్టింది.
ఊరు అంతా అప్పులు చేసి ఎంజాయ్ చేస్తున్న ఇలాంటి భర్త (husband)తనకు వద్దని, నువ్వే నాకు రూ 5 లక్షలు ఇచ్చి నాభర్తతో నువ్వు పడక సుఖం పొందాలని, భర్తను వదిలేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమల చెప్పడంతోం పంచాయితీ పెద్దలు బిత్తరపోయారు. అయితే అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడిని అందరి సమక్షంలో రూ 5 లక్షలకు కొనుక్కోవడానికి రజనీ అంగీకరించింది.
నెల రోజులలోపు నీకు రూ 5 లక్షలు ఇచ్చి నీ మొగుడిని (husband)శాస్వతంగా తనతో ఉండేలా చేసుకుంటానని రజనీ అందరి ముందు అంగీకరించింది. ఇదే సమయంలో అందరి సమక్షంలో భర్త జగన్నాథ్ ను రూ 5 లక్షలకు అమ్మేస్తున్నానని అమల లిఖితపూర్వకంగా లేఖరాసి రజనీకి ఇచ్చింది. ప్రియుడు జగన్నాథ్ భార్య (wife) అమలకు నెల రోజుల్లోపు రూ. 5 లక్షలు ఇచ్చి తన ప్రియుడిని కొనుక్కుంటానని రజనీ కూడా లిఖితపూర్వకంగా లేఖ రాసి ఇవ్వడంతో పంచాయితీ పెద్దలు బిత్తరపోయారు.
అయితే ఊరి పెద్దల సమక్షంలో ఓ మగడానికి విక్రయించడానికి, అతన్ని కొనుక్కోవడానికి ఇద్దరు మహిళలు ఒప్పందం చేసుకున్న విషయంలో మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, వాళ్ల పంచాయితీ గురించి మాకు తెలీదని పోలీసులు (police) అంటున్నారు. మొత్తం మీద 25 ఏళ్ల క్రితం ఎస్ వీ క్రిష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, రోజా నటించిన శుభలగ్నం సినిమా ఇప్పుడు మండ్యలో (mandya) రిపీట్ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications