పొట్టి మొగుడు, పొడువు పెళ్లామ్, అక్రమ సంబంధం మ్యాటర్ ఐసీయూ వరకు వెళ్లింది !

చెన్నై/చెంగల్పట్టు: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న భర్తతో అతని భార్య కాపురం చేస్తోంది. భార్య కంటే భర్త పొట్టిగా ఉండటంతో అతని భార్య సంసార సుఖం అనుభవించలేకపోయిందని తెలిసింది. ఇదే వియంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. తరువాత భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కథ రవసత్తరంగా మారిపోయింది.

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని బాలూర్ భగత్ సింగ్ కాలనీలో ప్రతాప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం సెల్వి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో ప్రతాప్ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న ప్రతాప్, సెల్వీ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

illeagalaffair1
అయితే వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినా ప్రతాప్, సెల్వీ దంపతులకు పిల్లలు పుట్టలేదు. భార్య కంటే పొడవులో ప్రతాప్ చాలా పొట్టిగా ఉంటాడు. నువ్వు పొట్టిగా ఉన్నావని, నీ భార్య పొడవుగా కత్తిలాగా ఉంటుందని, అందుకే నీకు పిల్లలు పుట్టలేదని స్థానికులతో పాటు తెలిసిన వాళ్లు, స్నేహితులు ప్రతాప్ ను ఆటపట్టించడం మొదలుపెట్టారు.

పెయింటర్ గా పని చేస్తున్న ప్రతాప్ కు అరుణ్ అనే స్నేహితుడు ఉన్నాడు. అరుణ్ ఇంటికి వెళ్లి వస్తున్న ప్రతాప్ కు అతని భార్య ప్రియా పరిచయం అయ్యింది. నిత్యం స్నేహితుడు అరుణ్ ఇంటికి వెళ్లి వస్తున్న ప్రతాప్ కు అతని ఫ్రెండ్ భార్య ప్రియా దగ్గర అయ్యింది. రానురాను ప్రతాప్, ప్రియాల స్నేహం అక్రమ సంబందానికి దారితీసింది.

police
ప్రతాప్ తో అక్రమ సంబందం పెట్టుకున్న ప్రియా అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియా, ప్రతాప్ అక్రమ సంబంధం విషయం అతని భార్యకు తెలిసిపోయింది. ప్రతాప్ భార్య పంచాయితీ పెట్టడంతో పెద్ద గొడవ జరిగింది. తరువాత పెద్దలు నువ్వు ప్రియా ఇంటి వైపు వెళ్లకూడదని, ఆమె కూడా నిన్ను కలవకూడదని ప్రతాప్ ను హెచ్చరించారు. పెద్దలు చాలా కాలంపాటు పంచాయితీలు చేశారు.

పెద్దల ఆదేశాల మేరకు ప్రతాప్ అతని ప్రియురాలు ప్రియాకు దూరం అయ్యాడు. అయితే ప్రతాప్ మోజులో ఉన్న ప్రియా మాత్రం అతన్ని వదల్లేదు. పదేపదే ప్రతాప్ కు ఫోన్ లు చెయ్యడంతో విసిగిపోయిన ప్రతాప్ అతని ప్రియురాలు ప్రియా మొబైల్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. అయితే ప్రియా మాత్రం ప్రతాప్ మోజులో నుంచి బయటకు రాలేక అతని వెంటపడి తనతో కలిసి జీవించాలని వేధించింది.

నడిరోడ్డులో ప్రతాప్ ను పట్టుకుని అతన్ని అవమానించింది. తనను మోసం చేశావని, తన భర్తను వదిలేసి నీతో వచ్చేస్తానని ప్రియా ఆమె ప్రియుడు ప్రతాప్ కు చెప్పింది. అయితే ప్రతాప్ మాత్రం అతని భార్యకు భయపడి ప్రియాకు దగ్గర కావడానికి భయపడిపోయాడు, ప్రియా టార్చర్ ఎక్కువ కావడంతో వేకువ జామున ఆమె ఇంటికి ప్రతాప్ వెళ్లాడు.

తరువాత పెయింట్ లో పెట్రోల్ మిక్స్ చేసిన ప్రతాప్ దానిని తీసుకుని అతని ప్రియురాలు ప్రియా మీద పోసేశాడు. ముఖంతో పాటు శరీరం 80 శాతం కాలిపోవడంతో ప్రియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి విషమంగానే ఉందని, కేసు విచారణలో ఉందని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు దూరం అయినా అతని మోజులో పడి అతని వెంటపడిన ప్రియా ఇప్పుడు ప్రాణం మీదకు తెచ్చుకోవడంతో ఆ ప్రాంతం ప్రజలు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+