Cyber Crime: యాప్ డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయింది.. అంతే రూ.90 వేలు మాయం..
ప్రజలను సైబర్ నేరగాల్లో ఏదో ఒక రకంగా మోసం చేస్తూనే ఉన్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఫోన్ లో ఓ యాప్ డౌన్ లోడ్ చేసి రూ.90 వేలు పోగొట్టుకున్నారు. సవితా శర్మ అనే మహిళ ఓ బ్యాంకులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నారు. ఆమె గత నవంబర్ 27 ఓ వెబ్ సైట్ ఓపెన్ చేశారు. అందులో ఒక థాలీ కొనండి, మరొకటి ఉచితంగా పొందండి అని ఉంది.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్ కుడా ఉంది. ఆ నంబర్ ఆమె ఫోన్ చేసింది. కానీ వారు లిఫ్ట్ చేయలేదు. కొద్దసేపటి తర్వాత ఆమెకు వేరే నంబర్ తో ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి హాల్లో మేడం మేం సాగర్ రత్న అనే రెస్టారెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలిపాడు. తమ రెస్టారెంట్ లో ఓ ప్రత్యేక ఆఫర్ ఉందని చెప్పాడు. ఒక థాలీ కొంటే, మరొకటి ఉచితమని చెప్పారు. ఆ తర్వాత సదరు వ్యక్తి సవితా శర్మకు ఓ లింక్ పంపించాడు. ఆఫర్ పొందాలంటే.. లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరాడు.

యాప్ లాగిన్ కావడానికి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ కూడా పంపించాడు. దీంతో సవితా శర్మ లింక్ పై క్లిక్ చేసింది. యాప్ డౌన్ లోడ్ చేసుకుంది. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అయింది. ఆ తర్వాత అసలు కథ మొదలయింది. సవితా శర్మ ఫోన్ అతవి వ్యక్తులు హ్యాక్ చేశారు. తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.40 తీశార. ఇందుకు సంబంధించి ఆమెకు మెసేజ్ వచ్చింది. కొద్ది సేపట్లోనే మరో రూ.50 వేలు డెబిట్ అయినట్లు సందేసం వచ్చింది.
సైబర్ మోసగాడు తన క్రెడిట్ కార్డు నుంచి డబ్బును తన పేటీఎం ఖాతాకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మోసగాడు తన ఖాతాలోకి డబ్బు మళ్లించుకున్నట్లు సవితా శర్మ చెప్పారు. రూ.90 డెబిట్ కాగానే తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేసినట్లు ఆమె తెలిపారు. వెంటనే సవితా శర్మ సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధి సంప్రదించినప్పుడు ఇలాంటి ఫిర్యాదుు వస్తున్నాయని చెప్పారు.
తమ రెస్టారెంట్ పేరుతో మోసాలు జరుగుతున్నట్లు తెలిసింది. మేము ఫేస్‌బుక్ ద్వారా ప్రజలకు ఎప్పుడూ ఆఫర్‌లు చేయనందున అటువంటి లాభదాయకమైన ఒప్పందం పట్ల అప్రమత్తంగా ఉండాలని మేము ప్రజలను హెచ్చరించామని ప్రతినిధి చెప్పాడు. ఇలాంటి మోసపూరిత ఆఫర్‌ల వెబ్ లింక్స్ ఇప్పటికీ వాట్సాప్ లో వస్తున్నాయని శర్మ అన్నారు.












Click it and Unblock the Notifications